వణికిస్తున్న వియత్నాం వేరియంట్ : హైబ్రీడ్ రకం గురించి ఎందుకు భయపడాలంటే...

First Published May 31, 2021, 12:42 PM IST

కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. రోజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతూ కాస్త ఊరటను కలిగిస్తుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ తాజా వేరియంట్ కొత్త గుబులు పుట్టిస్తోంది. కరోనా ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఇప్పటికే మానవాళిని భయాందోళనల్లోకి నెట్టేసింది. ఇప్పుడీ కొత్త వేరియంట్ మీద అనేక సందేహాలు, భయాలూ నెలకొంటున్నాయి. 

కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. రోజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతూ కాస్త ఊరటను కలిగిస్తుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ తాజా వేరియంట్ కొత్త గుబులు పుట్టిస్తోంది. కరోనా ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఇప్పటికే మానవాళిని భయాందోళనల్లోకి నెట్టేసింది. ఇప్పుడీ కొత్త వేరియంట్ మీద అనేక సందేహాలు, భయాలూ నెలకొంటున్నాయి.
undefined
వియత్నాంలో COVID-19 వైరస్ యొక్క కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. ఇది ఇండియన్, యూకే వేరియంట్ల హైబ్రీడ్ రకం. అయితే ఈ వేరియంట్ ఇంకా GISAID చేత రికార్డ్ చేయబడలేదు. అంతేకాదు ఇంకా పేరు పెట్టని ఈ వేరియంట్ గురించి సమాచారాన్ని గ్లోబల్ ఇనిషియేటివ్ పంచుకోవడం మీద దృష్టి సారించింది.
undefined

Latest Videos


వియత్నాంలో వెలుగు చూసిన ఈ వేరియంట్ కేసులు, మృతుల సంఖ్యను వియత్నాం ఆరోగ్య మంత్రి న్గుయెన్ తన్ లాంగ్ వెల్లడించలేదు. కానీ కొత్త వేరియంట్‌ను "చాలా ప్రమాదకరమైనది" అని తెలిపారు.
undefined
ఆగ్నేయాసియా దేశం ఇంతకుముందు ఏడు వైరస్ వేరియంట్‌లు బయటపడ్డాయి. B.1.222, B.1.619, D614G, B.1.17 UK వేరియంట్‌గా పిలువబడుతుంది. B.1.351, A.23.1, B.1.617.2 ఇండియన్ వేరియంట్‌గా పిలువబడుతుంది.
undefined
వియత్నాంలో వెలుగు చూసిన హైబ్రిడ్ COVID-19 వేరియంట్ గురించి ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఇది..- ఈ కొత్త వేరియంట్ ఇండియన్, యూకే వేరియంట్ల రెండు లక్షణాలనూ కలిగి ఉంది.
undefined
- ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే ఇది చాలా తేలికగా వ్యాప్తి చెందుతుంది. - ఇది గాలి ద్వారా తొందరగా వ్యాపిస్తుంది.
undefined
ఈ వైరస్ గొంతులో స్థిరపడి.. వేగంగా విస్తరిస్తుంది. పరిసరాల్లో బలంగా వ్యాపిస్తుంది.
undefined
వియత్నాం త్వరలో కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ గురించిన జన్యు డేటాను ప్రచురింనుంది.
undefined
లాబరేటరీ కల్చర్స్ లో ఈ వేరియంట్ చాలా త్వరగా రెప్లికేట్ అవుతుందని తేలింది. అందుకే చాలా తక్కువ సమయంలో వియత్నాంలో అనేక సంఖ్యలో కేసులు బయటపడ్డాయి.- ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, యుకెలలో కనిపించే వేరియంట్లను ‘ఆందోళన కరమైన గ్లోబల్ వైరియంట్లుగా’ గుర్తించింది.
undefined
- వైరస్ లలో ఉత్పరివర్తనాలు మామూలే. అలాంటి వాటిల్లో కొన్ని అసాధారణంగా ఉంటాయి. మరికొన్ని అంటువ్యాధుల్లా ప్రబలుతాయి.- COVID-19 కనుగొనబడిన దగ్గరినుంచి నేటి వరకు వెయ్యి ఉత్పరివర్తనలు కనుగొనబడ్డాయి.
undefined
- అయితే ఇప్పటివరకు కరోనావైరస్ లోని ఏ మ్యుటేషన్ వల్ల కూడా విస్తృత స్థాయిలో జనాభా తీవ్రమైన అనారోగ్యానికి గురైందన్నడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవు.- మామూలు కరోనా లాగే దీంతో కూడా వృద్ధులకు, కొమొర్బిడిటీ ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
undefined
కానీ కొత్త వేరియంట్ మరింత ఇన్ ఫెక్షన్ తో కూడి ఉండడం వల్ల అంటువ్యాధి ప్రమాదం పొచి ఉండి...జనాభాలో ఎక్కువ మరణాలకు దారితీయవచ్చు.గత కొన్ని వారాలలో వియత్నాం కేసుల సంఖ్య పెరిగినట్లు నివేదించింది. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 6700 కేసులు నమోదయ్యాయి. వాటిలో, ఈ ఏడాది ఏప్రిల్ చివరి నుండి సగానికి పైగా నమోదయ్యాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం వియత్నాంలో 47 COVID సంబంధిత మరణాలు సంభవించాయి.
undefined
click me!