ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లుపై దుమారం...పోలీసుల దర్యాప్తు, ఏం జరిగిందంటే....

First Published May 29, 2021, 9:56 AM IST

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లులపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా టాక్స్ పేయర్స్ డబ్బులను వాడి సబ్సిడీ ఇచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఫిన్లాండ్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు.

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లులపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా టాక్స్ పేయర్స్ డబ్బులను వాడి సబ్సిడీ ఇచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఫిన్లాండ్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు.
undefined
ప్రధాని తన అధికారిక నివాసం కేసరంతలో నివసిస్తున్నప్పుడు తన కుటుంబం బ్రేక్ ఫాస్ట్ కోసం నెలకు సుమారు 300 యూరోలు ($ 365) క్లెయిమ్ చేసి తీసుకున్నట్లు టాబ్లాయిడ్ ఇల్తలేహ్తిలో ఓ కథనం ప్రచురితమయ్యింది. దీంతో గత మంగళవారం నుంచి ప్రధానమంత్రి సన్నా మారిన్ ఇరుకున పడ్డారు.
undefined
దీనిమీద ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతేకాదు 35 యేళ్ల ప్రధాని తన పెద్దవాళ్లకు కూడా అలవెన్స్ లు ఇవ్వాలని పట్టుబట్టారని చెప్పుకొచ్చారు.
undefined
అయితే దీనిమీద ప్రధాని మారిన్ ట్విటర్ లో స్పందిస్తూ... ‘ఓ ప్రధానమంత్రిగా నేను నాకు ఇలాంటి బెనిఫిట్స్ కావాలని అడగలేదు, పట్టుబట్టలేదు’ అని పేర్కొన్నారు."ప్రధానమంత్రిగా నేను ఈ ప్రయోజనం కోసం అడగలేదు లేదా దానిపై నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనలేదు" అని మారిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
undefined
అయితే ప్రధానమంత్రి బ్రేక్ ఫాస్ట్ కోసం టాక్స్ పేయర్స్ డబ్బును వాడడం ఫినిష్ చట్టాలకు విరుద్దం అని న్యాయనిపుణులు అంటున్నారు.శుక్రవారం, ఈ సమస్యను పరిశీలించమని పోలీసులకు ఒక అభ్యర్థన వచ్చింది.. దీంతో పబ్లిక్-ఆఫీస్ నేరంపై ముందస్తు విచారణ దర్యాప్తును ప్రకటించారు.
undefined
"చట్టప్రకారం మంత్రి భోజనఖర్చు ఆమె జీతంలో భాగమే అయినప్పటికీ.. కొన్ని బిల్స్ రిఅంబర్స్ చేయబడ్డాయి’’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
undefined
ప్రధానమంత్రి కార్యాలయం లోపలున్న అధికారుల నిర్ణయాలపై తమ దర్యాప్తు దృష్టి సారిస్తుందని, దీంతో "ప్రధానమంత్రికి లేదా ఆమె అధికారిక కార్యకలాపాలకు ఏ విధంగానూ సంబంధం లేదు" అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ టీము జోకినెన్ ఒక ప్రకటనలో తెలిపారు.దర్యాప్తును స్వాగతిస్తున్నామని, అదేకనక నిజమని తేలితే ఆ బెనిఫిట్స్ ను సీజ్ చేస్తానని ప్రధాని మారిన్ శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు.
undefined
2019 డిసెంబరులో అధికారంలోకి వచ్చినప్పటి సోషల్ డెమొక్రాట్ రాజకీయ నాయకురాలైన మారిన్ భారీగా ప్రజల మద్దతును పొందారు. ఫిన్లాండ్ లో కరోనా కట్టడితో సమర్థవంతంగా పనిచేసి ఐరోపాలో అతి తక్కువ కరోనావైరస్ కేసులు ఉన్న దేశంగా ఆమె ప్రపంచ ప్రశంసలు అందుకుంది.
undefined
ఏదేమైనా, జూన్ 13 న ఈ దేశం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు, ఆమె పార్టీ ప్రతిపక్షాలు వెనక ఏం చేస్తున్నారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆమె పార్టీ మళ్లీ రికార్డుస్థాయిలో లాభాలను సాధిస్తుందని అంచనాలున్నాయి.
undefined
click me!