ఈ తల్లి కడుపు చల్లగా.. 23 యేళ్లకే 11 మంది పిల్లలు.. టార్గెట్ సెంచరీ దాటడమే.. !!

First Published Feb 16, 2021, 10:16 AM IST

నేటి జనరేషన్ లో పిల్లల్ని కనాలంటే చాలా ఆలోచిస్తున్నారు. ఒక్కరు లేదా ఇద్దరు అంతకుమించి అంటే అమ్మో అనేస్తున్నారు దంపతులు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, వేరు కాపురాలు, పిల్లల ఆలనా, పాలనా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థిక అంశాలు ఇలాంటివన్నీ దీనికి కారణాలే. 

నేటి జనరేషన్ లో పిల్లల్ని కనాలంటే చాలా ఆలోచిస్తున్నారు. ఒక్కరు లేదా ఇద్దరు అంతకుమించి అంటే అమ్మో అనేస్తున్నారు దంపతులు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, వేరు కాపురాలు, పిల్లల ఆలనా, పాలనా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థిక అంశాలు ఇలాంటివన్నీ దీనికి కారణాలే.
undefined
అందుకే మాగ్జిమమ్ ఇద్దరు పిల్లలు పుట్టగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కానీ ఓ జంట మాత్రం దీనికి భిన్నం. ఇప్పటికే వీరికి పదకొందు మంది చిన్నారులున్నారు. అయితే వీరికి మొత్తం వందకు పైగా పిల్లలు కావాలట. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. అది సాధ్యమయ్యే విషయమేనా అంటే.. ప్రయత్నలోపం లేకుండా ట్రై చేస్తాం అంటున్నారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నారు.
undefined
ఇంతకీ వీరు గురించి వివరాలు ఏంటంటే.. రష్యాకు చెందిన క్రిస్టియానా ఓజ్ టర్క్ కు 23 ఏళ్లు, ఆమె భర్త గాలిప్ ఓజ్ టర్క్. జార్జియాలో వీరికి ఖరీదైన హోటల్ ఉంది. బాగా డబ్బులున్నవాళ్లే. అయితే, క్రిస్టియానా దంపతులకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం. వీరికి ఆరేళ్ల క్రితం మొదటిసారి ఓ ఆడపిల్ల పుట్టింది. ఈమెకు నేరుగా క్రిస్టియానా జన్మనిచ్చింది. ఆ తరువాత తమకు కావాల్సిన పిల్లల కోసం సరోగసీ విధానం మీద ఆధారపడ్డారు.
undefined
జార్జియాలో సరోగసీ చట్టబద్ధమే.. అందుకే ఇప్పటివరకు క్రిస్టియానా దంపతులు సరోగసి ద్వారా పదిమంది చిన్నారులకు తల్లిదండ్రులుగా మారారు. వీరు ఒక్కో బిడ్డ కోసం 8వేల యూరోలు ఖర్చు చేశారట. అంతేకాదు ఇంతటితో పిల్లల్ని కనడం ఆపబోమని కూడా వీళ్లు చెబుతున్నారు.
undefined
105మంది పిల్లలకు తల్లిదండ్రులు అవ్వాలనేది ఈ దంపతుల లక్ష్యమట. ఆశ్చర్యంగా ఉంది కదా.. అంతేకాదు సరోగసీ విధానంలో తమ బిడ్డను కడుపులో మోసే మహిళతో క్రిస్టియానా దంపతులు అస్సలు మాట్లాడరు. వారితో ముఖాముఖి కనిపించకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
undefined
దీనికీ కారణముంది.. భవిష్యత్తులో పిల్లల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉండకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు సరోగసీకి ఒప్పుకునే మహిళలతో ఎలాంటి న్యాయ పరమైన చిక్కలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు తల్లిదండ్రులవుతున్నారు.
undefined
వీరిని శతాయుష్మానుభవ అని కాకుండా శతసంతానప్రాప్తిరస్తూ అని దీవించాలి. ఇంకేం కానివ్వండి..
undefined
click me!