వాలెంటైన్స్ డే రోజు.. ఫ్రీ విడాకులు... లా కంపెనీ బంపర్ ఆఫర్ !!

First Published Feb 4, 2021, 12:16 PM IST

ఫిబ్రవరి వచ్చిందంటే...చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల మదిలో మధురోహలు చెలరేగుతుంటాయి. కొత్తగా ప్రేమలో పడ్డవారు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు తమ ప్రేయసీప్రియులను సర్ఫ్రైజ్ చేయడానికి రకరకాల ప్లాన్లు వేసుకుంటుంటారు.

ఫిబ్రవరి వచ్చిందంటే...చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల మదిలో మధురోహలు చెలరేగుతుంటాయి. కొత్తగా ప్రేమలో పడ్డవారు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు తమ ప్రేయసీప్రియులను సర్ఫ్రైజ్ చేయడానికి రకరకాల ప్లాన్లు వేసుకుంటుంటారు.
undefined
జంటలేని సింగిల్స్, భగ్నప్రేమికులకు వాలంటైన్స్ డే అంటేనే పీడకలగా ఉంటుంది. ఇక ప్రేమికులుగా ఒక్కటే జంటలుగా మారినవారికి ఈ రోజు మరింత ప్రత్యేకం.
undefined
అయితే ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ వాలెంటైన్స్ డే నాడు ఫ్రీగా విడాకులు ఇప్పిస్తామని బంపర్ ఆఫర్ ఇస్తుందో లా కంపెనీ.
undefined
ప్రేమికుల దినోత్సవం నాడు ఈ విచిత్ర ప్రకటన ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే దీని గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే మనం టేనస్సీ లోని క్రాస్ విల్లే కి వెళ్లాల్సిందే..
undefined
టేనస్సీ లోని క్రాస్ విల్లేలోని పవర్స్ లా ఫర్మ్ ఈ విచిత్రమైన ఆఫర్ ఇచ్చి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
undefined
అయితే ఇంతకీ ఈ కంపెనీ ఇలా ఎందుకు ప్రకటించింది అంటే ‘వాలెంటైన్స్‌ డే లాంటి పిచ్చి సంస్కృతి వల్ల మనుషులు తమ ఆర్థిక స్థితిని ఆలోచించుకోకుండా.. ప్రేమలో పడతారు.. పెళ్లి చేసుకుంటారు.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కుంటారు. దీనికి వేరే కారణాలు తోడై ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తితో విడాకులు తీసుకోవాలనుకుంటారు’ అంటున్నారు.
undefined
ఇలాంటి వారికి ఫ్రీగా విడాకులు ఇప్పిస్తామని ప్రకటించింది ఈ లా కంపెనీ. తమకు వచ్చిన అప్లికేషన్స్ లో ఒక లక్కీ కపుల్‌ని సెలక్ట్‌ చేసి.. వారి విడాకులకు సంబంధించి ఉచితంగా లీగల్‌ సర్వీస్‌ చేస్తామని.. కోర్టు ఫీజు కూడా తీసుకోమని వెల్లడించింది.
undefined
దీనికోసం పవర్స్ లా తన ఫేస్ బుక్ పేజ్ లో ఇలా ప్రకటన ఇచ్చింది.. ‘కరోనాతో ఈ యేడాది ఎంతో భయంకరంగా గడిచింది. కరోనాతో దేశం రెండుగా చీలిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో మేం ఓ లక్కి కంటెస్టెంట్‌కి వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఉచితంగా విడాకులు ఇప్పించడానికి నిర్ణయించాం’ అంటూ చెప్పుకొచ్చింది.
undefined
అంతేకాదు వాలెంటైన్స్ డే లాంటి పిచ్చి సంస్కృతి మాయలో పెళ్లిళ్లు చేసుకుని ఇబ్బందులు పడేవారికి ఇది బంపర్ ఆఫర్ అంటూ ఊరిస్తోంది. దీనికి తోడు ‘ఇక మన దేశంలో విడాకులు తీసుకోవడం ఎంత ఖర్చుతో కూడుకున్న పనో అందరికీ తెలిసిందో.
undefined
విడాకుల కేసు 1,150 డాలర్ల నుంచి మొదలవుతుంది. చాలామంది విడిపోవాలనుకున్న జంటలు వీటిని భరించే స్థితిలో కూడా లేరు. అందుకే ఈ ఆఫర్‌’’ అని సంస్థ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించింది.
undefined
ఆసక్తి ఉన్నవారు తాము ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో చెబుతూ.. తమ కంపెనీకి ఈ మెయిల్ చేయాలట. భార్యభర్తలిద్దరూ విడాకులకు సిద్ధంగా ఉండాలని, వీరికి పిల్లలు ఉండకూడదని కండిషన్ పెట్టింది.
undefined
అలాంటి వారే ఈ కాంటెస్ట్ కి అర్హులని తేల్చేసింది. ఇందులో విన్నర్ ని ఫిబ్రవరి 19న ప్రకటిస్తామని వెల్లడించింది. భలే ఉంది కదా ఈ బంపర్ ఆఫర్.
undefined
click me!