దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు అనేక కొత్త ఉత్పరివర్తనాలతో ఉన్న కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ ను కనుగొన్నారు.
C.1.2 గా పిలిచే ఈ రకం వేరియంట్ ను మే లో గౌటెంగ్, మపుమలాంగా, దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా ప్రావిన్సులు, జోహన్నెస్ బర్గ్ లలో కనుగొన్నామని శాస్త్రవేత్తలు ఓ పరిశోధనా పత్రంలో తెలిపారు. ఆగస్ట్ 13 నాటికి ఇది దక్షిణాఫ్రికాలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఆరు ప్రావిన్సుల్లో.. రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, పోర్చుగల్, న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ లలో కనిపించింది.