ఫ్లైట్ రిస్క్.. మెహుల్ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా కోర్టు...

First Published Jun 12, 2021, 10:00 AM IST

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 13,500 కోట్లు రుణం తీసుకుని మోసం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో భారత్ నుంచి  పారిపోయిన ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమెనికన్ కోర్టు షాక్ ఇచ్చింది. "ఫ్లైట్ రిస్క్" అనే కారణం చూపిస్తూ డొమినికన్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 
 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 13,500 కోట్లు రుణం తీసుకుని మోసం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో భారత్ నుంచి పారిపోయిన ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమెనికన్ కోర్టు షాక్ ఇచ్చింది. "ఫ్లైట్ రిస్క్" అనే కారణం చూపిస్తూ డొమినికన్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
undefined
డొమినికా హైకోర్టు న్యాయమూర్తి వైనంటే అడ్రియన్-రాబర్ట్స్ కూడా చోక్సికి డొమినికాతో ఎలాంటి సంబంధాలు లేవని, కోర్టు అతన్ని దేశం విడిచి వెళ్ళకుండా నిరోధించే షరతులు విధించలేదని హైలైట్ చేసిందని ఆంటిగ్వా న్యూస్‌రూమ్ నివేదించింది.
undefined
తన బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరించడంతో చోక్సీ హైకోర్టును ఆశ్రయించారు. డొమినికన్ హైకోర్టు ఈ నిర్ణయంతో చోక్సీని భారతదేశానికి తిరిగి పంపించే ప్రక్రియకు కాస్త బ్రేక్ పడింది. చోక్సీకి కొంత ఉపశమనం లభించిందని ANI తెలిపింది.
undefined
బ్యాంకింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ అంటిగ్వా దీవిలో ఇన్నాళ్లు తలదాచుకున్నారు. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అంటిగ్వా నుంచి డొమినికా పారిపోయిన మెహుల్ చోక్సీ డొమినికాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్తానిక మీడియా తెలిపింది.
undefined
ఈ నెల 25న చోక్సీ అంటిగ్వా నుంచి పారిపోగా అతని ఆచూకీ కోసం ఇంటర్ పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. 62యేళ్ల చోక్సీని డొమినికాలో అక్రమంగా ప్రవేశించాడనే అభియోగంపై సోమవారం మళ్లీ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆంటిగ్వా న్యూస్‌రూమ్ తెలిపింది.
undefined
డొమినికా ప్రధాని చోక్సిని "భారతీయ పౌరుడు" అని పేర్కొన్న కొద్ది రోజుల తరువాత కోర్టు తీర్పు వస్తుంది. "ఈ భారతీయ పౌరుడి విషయం కోర్టు ముందు ఉంది, ఈ వ్యక్తి విషయంలో ఏం తేలుస్తారో అది కోర్టులు నిర్ణయిస్తాయి. కోర్టు ప్రక్రియను కొనసాగించడానికి మేం అనుమతిస్తున్నాం" అని డొమెనికన్ ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ స్థానిక మీడియాకు తెలిపారు.
undefined
2018లో భారత్ నుంచి పారిపోయి అంటిగ్వాలో ఉంటున్న చోక్సీ అక్కడినుంచి క్యూబాకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుబడ్డాడు. అతను ఆంటిగ్వా నుండి పొరుగున ఉన్న డొమినికాకు పడవలో బయలుదేరాడు. అప్పటికే అతనిమీ జారీ అయిన ఇంటర్‌పోల్ లుకౌట్ సర్క్యులర్‌తో, డొమినికాలోని ఒక బీచ్ నుండి పోలీసులు చోక్సీని పట్టుకున్నారు.
undefined
అయితే ఆంటిగ్వాలో ఇండియన్స్ లాగా కనిపించే పోలీసులు అతన్ని కిడ్నాప్ చేసి, పడవలో డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.వజ్రాల వ్యాపారి, అతని మేనల్లుడు నీరవ్ మోడీతో పాటు, భారత దర్యాప్తు సంస్థలు నకిలీ పత్రాలను ఉపయోగించి.. ప్రభుత్వ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 13,500 కోట్ల రూపాయల రుణాలను మోసం చేశాయని ఆరోపించారు. లండన్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్ మోడీ తనను భారత్‌కు అప్పగించాలని కోరుతున్నాడు.
undefined
click me!