నరమాంసభక్షకుడు : స్నేహితులను చంపి, ఉడికించి తినేశాడు.. ! జీవిత ఖైదు విధించిన కోర్టు !!

First Published Feb 16, 2021, 12:01 PM IST

మాస్కోలో ఘోరమైన దారుణ ఘటన జరిగింది. ఓ నరమాంసభక్షకుడు సొంత స్నేహితులనే కిరాతకంగా హతమార్చి, వారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఉడికించుకుని తిన్నాడు. చదువుతుంటేనే కడుపులో తిప్పేస్తున్న అతిభయంకరమైన ఈ ఘటన రష్యాలోని అర్ఖంగెల్క్స్ లో జరిగింది. 

undefined
ఈ కేసులో నిందితుడైన ఎడ్వర్డ్ సెలజ్నేవ్ కు రష్యా అత్యున్నత న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2016-17 మధ్య కాలంలో అతను ఈ అతి దారుణఘటనకు ఒడిగట్టాడు.
undefined
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలోని అర్ఖంగెల్క్స్ ప్రాంతనికి చెందిన 51 యేళ్ల ఎడ్వర్డ్ సెలజ్నేవ్ కు ముగ్గురు స్నేహితులున్నారు. వీరు వరుసగా 59, 43, 34 యేళ్ల వయసు వారు.
undefined
2016-17 మధ్య కాలంలో వీరికి ఎడ్వర్డ్ సెలజ్నేవ్ మద్యం తాగించి అతి క్రూరంగా హత్య చేశాడు. ఆ తర్వాత వారి మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి.. వాటిని ఉడికించుకుని తిన్నాడు. తాను తినగా మిగిలిపోయిన శరీరభాగాలను ఓ సంచిలో మూటగట్టి దగ్గర్లోని నదిలో పడేశాడు.

అయితే అతని స్నేహితుల్లో 59, 43 యేళ్ల వ్యక్తులను నా అనేవారు లేరు. దీంతో సమస్య ఎదురుకాలేదు. ఇక 34 యేళ్ల వ్యక్తికి కుటుంబం ఉంది. వారికి డౌట్ వస్తుండేమో అనే అనుమానంతో సెలజ్నేవ్ వారిని కలిశాడు.

అతని కుటుంబసభ్యులతో ‘మీ వాడు ఉద్యోగం కోసం వేరే చోటికి వెళ్లాడ’ని నమ్మబలికాడు. అంతేకాదు ఈ విషయాన్ని వాళ్లకు చెప్పమని తనకు చెప్పాడని చెప్పుకొచ్చాడు. జరిగిన విషయం కనీసం ఊహకు కూడా అందదు కాబట్టి.. అతను చెప్పింది వాళ్లు నమ్మారు.
undefined
కానీ రోజులు గడుస్తున్నా అతని జాడ లేకపోవడం, కనీసం అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
undefined
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎడ్వర్డ్ సెలెజ్నెవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో ఎడ్వర్డ్ సెలెజ్నెవ్ తాను చేసిన నేరాలను అంగీకరించాడు
undefined
అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు తాజాగా అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
undefined
click me!