యేడాది అజ్ఞాతం తరువాత బైటికొచ్చిన ఉత్తరకొరియా అధ్యక్షుడి భార్య.. కారణమేంటంటే...

First Published Feb 17, 2021, 11:58 AM IST

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఏడాది అజ్ఞాతం తరువాత మొదటిసారి ఓ సంగీత వేడుకలో కనిపించారు. గత ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కనిపించకపోవడం గురించి ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఏడాది అజ్ఞాతం తరువాత మొదటిసారి ఓ సంగీత వేడుకలో కనిపించారు. గత ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కనిపించకపోవడం గురించి ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
undefined
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జింగ్ టు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాడు చేసిన ఓ సంగీత కార్యక్రమానికి భర్తతో కలిసి ఆమె హాజరయ్యారు. కిమ్ జింగ్ టు జ్ఞాపకార్థం ఆయన పుట్టిన రోజును డే ఆఫ్ షైనింగ్ స్టార్ గా జరుపుకోవడం అక్కడ ఆనవాయితీ.
undefined
ఉత్తర కొరియా జనరల్ సెక్రటరీ కిమ్ జోంగ్ తన భార్య రి సోల్ జుతో ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే అక్కడున్నవారంతా సంతోషంతో ‘హుర్రే’ అంటూ అరిచారు. అందరిలోనూ కొత్త ఉత్సాహం ఉరకలు వేసింది. వీరికి సంగీత విందును చేశారు నిర్వాహకులు.." పీపుల్ ఆర్ ఆఫ్ ఎ సింగిల్ మైండ్’’ లాంటి పాటలతో కలిపి అనేక పాటలు ప్లే చేశారు. తెల్లారి అన్ని ప్రధాన వార్తా పత్రికల్లోనూ మొదటి పేజీలో వీరిద్దరి ఫొటోలు, వార్తలు ప్రచురించారని కోరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సమాచారం.
undefined
32 యేళ్ల రీ సోల్ జు కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు విర్చువల్ మీటింగ్స్ లో కూడా ఆమె పాలు పంచుకోలేదు. అంతర్జాతీయ సందర్శనలతో సహా దేశంలో జరిగే సంప్రదాయ కార్యక్రమాలకు కూడా ఆమె హాజరు కాలేదు. దీనిమీద గత జనవరి చివర్లో ఆ దేశ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. నాయకుడి భార్య కనిపించకపోవడంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి.
undefined
2012లో ఆమె మొదటిసారిగా వార్తల్లో కనిపించారు. రీ సోల్ జు భర్త కిమ్ జోంగ్ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత ఆమె ప్రస్తావన మొదలయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 200 సార్లు ఆమెగురించిన వార్తా కథనాలు వెలువడ్డాయని ఎన్ కె న్యూస్ డాటాబేస్ సెర్చ్ లో తేలింది. ఈ క్రమంలో ఏడాదిపాటు అజ్ఞాతంలో ఉండడంపై ఆ దేశ మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా ఉత్తర కొరియా ఎటువంటి వివరణ ఇవ్వలేదు
undefined
ఇన్ని రోజులు ఆమె కనిపించకపోవడానికి కారణం కరోనావైరస్ గురించిన ఆందోళనే అయితే.. ఇప్పుడు రీ సోల్ జు కనిపించడం..దేశంలోని కరోనా పరిస్థితులపై వాటిమీద విధించిన నిర్భంధంపై ప్రజల్లో పాజిటివిటీని తీసుకువచ్చే అవకాశం ఉందని రాచెల్ మిన్యాంగ్ లీ అన్నారు. ఉత్తర కొరియాకు సంబంధించిన ప్రాంతాలలో అమెరికా ప్రభుత్వానికి పనిచేసే స్వతంత్ర రాజకీయ విశ్లేషకుడు రాచెల్ మిన్యాంగ్ లీ.
undefined
ఇదిలా ఉంటే దక్షిణ కొరియా గూఢచార సంస్థ మంగళవారం తమ పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం తరువాత మాట్లాడుతూ మహమ్మారి నేపథ్యంలో పిల్లలను, చూసుకోవడం కోసమే ఆమె బైటికి రాకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
undefined
అంతేకాదు ఉత్తరకొరియా కోవిడ్ -19 వ్యాక్సిన్ , చికిత్సల సమాచారం కోసం ఫైజర్ ఇంక్‌ను హ్యాక్ చేసిందని ఏజెన్సీ తెలిపింది. అందుకే ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్ ఒక్క కరోనావైరస్ కేసు కూడా లేదని వారు అన్నారు. దీనిమీద యు.ఎస్, జపాన్ తో సహా అనేకమంది అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు.
undefined
రీ సోల్ జు అనారోగ్యానికి గురై ఉండవచ్చని, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న కిమ్ కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకుని ఉండొచ్చని, తన కుమార్తెను స్కూలుకు సిద్ధం చేస్తుండవచ్చని ఉత్తర కొరియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
undefined
కిమ్ ఆరోగ్యం గురించి గానీ, నాయకుడి కుటుంబ విషయాలు గానీ ఉత్తర కొరియాలో అత్యంత రహస్యంగా ఉంచబడతాయి. వీటి గురించిన వివరాలు కిమ్ అంతర్గత వర్గాల్లో కొద్దిమందికి మాత్రమే తెలుసు.
undefined
ఉత్తర కొరియా నాయకుడు రి టీనేజ్ లో ఉన్నప్పుడు నార్త్ కొరియా ఛీర్‌లీడింగ్ స్క్వాడ్‌లో పనిచేశారు. మంచి గాయకురాలు కూడా. ఆమె మొదటిసారి చైనాలో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశానికి తన భర్తతో కలిసి హాజరయ్యారు. అక్కడ ఈ జంట అధ్యక్షుడు జి జిన్‌పింగ్, అతని భార్యతో కలిసి భోజనం చేశారు. ఉత్తర కొరియాలోని మౌంట్ పెక్టూ మంచుపర్వతల మీదికి కిమ్ తో పాటు గుర్రాలపై స్వారీ చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబ పాలనకు గుర్తుగా జరుగుతుంది.
undefined
కిమ్, రీ సోల్ జు వివాహం 2009లో జరిగిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారని భావిస్తున్నారు, కాని వారి సంతానం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే డెన్నిస్ రాడ్ మన్ అనే ఆఫ్ బీట్ బాస్కెట్ బాల్ ప్లేయర్ 2013లో తన ఉత్తర కొరియా పర్యటనలో, నాయకుడిని కలిసానని, ఆతని కూతుర్ని తన చేతులతో ఎత్తుకున్నానని తెలిపారు. ఆమె పేరు జు యే అని కూడా అన్నారు.
undefined
click me!