మెడపై ఒత్తిడితో ఫ్లాయిడ్ మృతి: జార్జ్‌కి కరోనా, ట్రంప్‌కి షాకిచ్చిన చిన్న కూతురు

First Published | Jun 4, 2020, 2:23 PM IST

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అల్లర్లు చేలరేగాయి. ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులను విధుల నుండి తప్పించారు. అయినా కూడ అల్లర్లు తగ్గలేదు.

అమెరికాలో పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోస్టు మార్టం నివేదికను వైద్యులు బుధవారం నాడు విడుదల చేశారు.ఈ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసు కాలు పెట్టడం వల్ల మరణించాడు. ఈ విషయమై అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. అమెరికాతో పాటు ఫ్రాన్స్ లో కూడ ఇదే విషయమై అల్లర్లు చెలరేగాయి.

అమెరికాలో అల్లర్లను అణచివేస్తామని ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే సైన్యాన్ని కూడ రంగంలోకి దించుతామని ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్రంప్ వెనక్కి తీసుకొన్నాడు.
ఫ్లాయిడ్ మృతికి మెడపై తీవ్రమైన ఒత్తిడే కారణమని వైద్యులు ప్రకటించారు. దీన్ని నరహత్యగా వైద్యులు అభివర్ణించారు.ప్లాయిడ్ కుటుంబసభ్యుల అనుమతితో ఈ నివేదికను వైద్యులు బయటపెట్టారు.
ఫ్లాయిడ్ కు కరోనా సోకిందని కూడ ఈ నివేదికలో వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని కూడ వైద్య బృందం తెలిపింది. అతను మరణించే సమయానికి ఫ్లాయిడ్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయని హెన్నెపిన్ కౌంటీ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ చెప్పారు. 20 పేజీల నివేదికను ఆయన విడుదల చేశారు.
జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై నల్ల జాతీయులతో పాటు శ్వేత జాతీయులు కూడ సంఘీభావంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతిపై సాగుతున్న నిరసనలకు మద్దతుగా ట్రంప్ చిన్న కూతురు టిఫాని ట్రంప్ సంఘీభావం ప్రకటించారు.
బ్లాక్ ఔట్ ట్యూన్ డే, జస్టిస్ ఫర్ జార్జ్ ఫ్లాయిడ్ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి. ట్రంప్ చిన్న కూతురు టిఫాని ట్రంప్ బ్లాక్ కలర్ లో ఉన్న ఫోటోను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో షేర్ చేశారు.
ఒంటరిగా పోరాడితే ఫలితం తక్కువే. కలిసి నడిస్తే ఎంతో సాధించవచ్చు అంటూ హెలెన్ కెల్లర్ మాటలను క్యాప్షన్ గా రాశారు.ట్రంప్ రెండో భార్య కూతురు టిఫాని ట్రంప్. ఆమె తల్లి కూడ ఫ్లాయిడ్ కు జరిగిన అన్యాయంపై పోరాటం నిర్వహిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడ తన నిరసనను వ్యక్తం చేస్తూ సంఘీభావం తెలిపారు.

Latest Videos

click me!