2,500 యేళ్ళైనా చెక్కు చెదరని ‘మమ్మీ’..

First Published Oct 7, 2020, 11:30 AM IST

ఈజిప్టు చరిత్రలో మమ్మీలది ముఖ్య పాత్ర.  పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న వేల యేళ్లనాటి మమ్మీలను వెలికితీసి వాటి చరిత్రను తవ్వి తీయడం అక్కడి సైంటిస్టులకు ఎంతో ఆసక్తి. అలా ఇటీవల 2,500 యేళ్లనాటి ఓ మమ్మీని ఈజిప్టు శాస్త్రవేత్తలు తెరిచారు. 

ఈజిప్టు చరిత్రలో మమ్మీలది ముఖ్య పాత్ర. పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న వేల యేళ్లనాటి మమ్మీలను వెలికితీసి వాటి చరిత్రను తవ్వి తీయడం అక్కడి సైంటిస్టులకు ఎంతో ఆసక్తి. అలా ఇటీవల 2,500 యేళ్లనాటి ఓ మమ్మీని ఈజిప్టు శాస్త్రవేత్తలు తెరిచారు.
undefined
ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటిక సక్కారా. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు. శనివారం దీంట్లోని ఓ శవపేటికను తెరిచారు.
undefined
2,500 యేళ్లు గడిచినా శవపేటికలు, అందులోని మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గుర్తించారు. ఈ శవపేటికలు ఈజిప్టు సమాజంలోని పూజారులు, గొప్ప వ్యక్తులువిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈజిప్ట్‌ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తన ఖాతా పోస్ట్ చేసింది. ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈజిప్టులోని న్యూజిలాండ్ రాయబారి గ్రెగ్ లూయిస్ కూడా శనివారం ట్విటర్‌లో అన్‌సీలింగ్ వీడియోను పంచుకున్నారు.
undefined
ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈజిప్టు పురావస్తు శాఖ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటిదాకా 9 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.
undefined
2020 సంవత్సరంలో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం అంత మంచిది కాకపోవచ్చేమో అని ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ప్రకారం, పాప్‌ సంస్కృతిలోని జానపద కథల్లో మమ్మీలను తెరవడం ద్వారా మరణాలకు, శాపాలకు దారితీస్తుందనే అపోహ కూడా ఉంది.
undefined
ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికితీశారు. వీటిని గిజాలోని కొత్త గ్రాండ్‌ ఈజిప్టియన్‌ మ్యూజియానికి తరలించి ప్రదర్శన కోసం ఉంచనున్నారు.
undefined
click me!