తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు నూతనంగా ఎన్నికయిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.