Salaar : `కేజీఎఫ్-2`- `సలార్` మధ్య క్రాసోవర్ కనెక్షన్, అదే ‘కేజీఎఫ్-3’

First Published | Apr 16, 2022, 7:20 PM IST

 'కేజీఎఫ్2' హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అందరూ కూడా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దానికి తగ్గట్లే భారీ వసూళ్లను రాబడుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ కి, యష్ పెర్ఫార్మన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.


KFG చాప్టర్ 2   హై సక్సెస్ తర్వాత, మేకర్స్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్- “సలార్” ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నారు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్  “సలార్” చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాదు  “సలార్” చిత్రంలో అత్యధిక సంఖ్యలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు కేజీఎఫ్ రిలీజ్ తర్వాత రివీలై, అభిమానులను ఉర్రూతలూగించిన మరో వాస్తవం క్రాస్ ఓవర్. అయితే అది నిజంగా సాధ్యమేనా?

వాస్తవానికి  క్రాస్ ఓవర్ గురించి ఆలోచిస్తే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మార్వెల్స్ ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ మరియు ఇన్ఫినిటీ వార్.  విశ్వంలోని సూపర్ హీరోలందరూ కలిసి థానోస్‌తో పోరాడారు. ఇప్పుడు అదే పద్దతిలో  భారతీయ సినిమా కూడా విభిన్న సూపర్‌హిట్ చిత్రాల మధ్య క్రాస్‌ఓవర్‌ను ప్రొజెక్ట్ చేయబోతున్నాయా అంటే అవుననే వినపడుతోంది.




అందుకు కారణం లేకపోలేదు..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తిగా గమనిస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా  నటిస్తుంది. “రాధేశ్యామ్”తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ “సలార్”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక “సలార్” షూటింగ్ సగం పూర్తి కాగా, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు .


ఈ నేపధ్యంలో KGF చాప్టర్ 2ని చూసిన చాలా మందికి ఈ ఆలోచన వచ్చింది.  వారు చెప్పే లాజిక్ ఏమిటంటే సినిమాలో రాకీ భాయ్ ...ఇంత సులభంగా దేశ ప్రధాని ఆఫీస్‌పై ఎలా దాడి చేసాడు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు కొన్ని వివరాలను కోల్పోతున్నారు అంటున్నారు. రాకీ భాయ్ కు అప్పటికే  అధికారంలో ఉన్న సాలార్ సైన్యం మద్దతు ఉంది.

అందుకే కేజీఎఫ్ 2 లో  1979-1981 కాలక్రమం ఉద్దేశపూర్వకంగా దాటవేయబడింది. ప్రశాంత్ నీల్ ఆలోచనల ప్రకారం అప్పుడు సలార్ మరియు రాకీ ల మధ్య క్రాస్ఓవర్ జరుగుతుంది మరియు KGF చాప్టర్ 3 ప్రారంభమవుతుంది.

prabhas kgf chapter


'కేజీఎఫ్2'కి చివరిలో కొనసాగింపుగా 'కేజీఎఫ్3' కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలానే అందులో ఈ సారి స్టోరీ ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పేశారనే చెప్పాలి.

KGF2


ఇంతవరకూ ఇండియాలోనే జరిగిన 'కేజీఎఫ్' కథ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని సమాచారం. అందుకే 'కేజీఎఫ్ 2' చిత్రం చివరిలో రాకీభాయ్ వస్తుంటే.. అతడి షిప్ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడుతున్నట్టు చూపించారు. రాకీభాయ్ సామ్రాజ్యం విదేశాలలో కూడా విస్తరించినట్లు చూపించారు. దాంతో పాటు రాకీ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్లు ఉంటుంది.

వీటిని చూసిన సిని ప్రేక్షకులు 'కేజీఎఫ్'కి పార్ట్ 3 కూడా రాబోతోందని నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డార్లింగ్‌ ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్‌' రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చిన తరవాత 'కేజీఎఫ్' పార్ట్ 3 పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.

Salaar and KGF


“సలార్” మూవీ కొత్త షెడ్యూల్ మే 1 నుంచి స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇక ఇది పక్కా తెలుగు పాన్ ఇండియా సినిమా అని, ‘కేజీఎఫ్-2’లో ఉన్నటువంటి అద్భుతమైన ఎమోషన్స్, ఎలివేషన్స్ “సలార్”లో కూడా ఉంటాయని, కాకపోతే అక్కడ యష్, ఇక్కడ ప్రభాస్ అంటూ చెప్తున్నారు. ఇక “కేజీఎఫ్-2” అంచనాలను మించి ఉండడంతో “సలార్”పై హైప్ ఆకాశాన్ని తాకిందని చెప్పాలి. దీంతో “సలార్” గురించి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్స్ ఫ్యాన్స్.

ప్రభాస్ తాజాగా ‘కేజీఎఫ్-2’ సక్సెస్ గురించి మాట్లాడుతూ “కేజీఎఫ్: చాప్టర్ 2 సూపర్ సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడితో నేను “సలార్‌” చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మనకు మరిన్ని పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లు రావాలి” అని ప్రభాస్ అన్నారు. సగం షూటింగ్‌ పూర్తయిన “సలార్‌” షూటింగ్‌ను త్వరలో తిరిగి ప్రారంభించనున్నారు. ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ప్రభాస్ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు.

Latest Videos

click me!