మహేష్ బాబు ఇరవై ఏళ్ల క్రితం చేసిన పాత్రే ఇప్పుడు షారూఖ్ చేస్తున్నారా?

Published : Mar 08, 2025, 09:33 AM IST

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘కింగ్‌’తో రానున్నట్లు చెప్పారు.   సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

PREV
13
 మహేష్ బాబు ఇరవై ఏళ్ల క్రితం చేసిన పాత్రే  ఇప్పుడు షారూఖ్ చేస్తున్నారా?
Shah Rukh Khan to play a professional assassin in his next film with daughter? in telugu


 
Shah Rukh Khan : కొత్త కథలు అనేవి ఉండవు. ఆ తొమ్మిది కథలనే అటూ ఇటూ తిప్పుతుంటారు అని సినిమావాళ్లు చెప్తూంటారు. అందులో నిజమెంత ఉందో కానీ, టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా పాత కథలు, పాత్రలు తీసుకుని కొత్త సినిమాలు చేస్తూంటుంది.

ఇప్పుడు అలాగే మహేష్ బాబు ఇరవై ఏళ్ల క్రితం చేసిన పాత్రలాంటిదే షారూఖ్ ఖాన్ తన కొత్త చిత్రంలో చేయబోతున్నారట. అయితే అది చాలా భారీ  స్కేల్ లో కొత్త తరహా ట్విస్ట్ లు, టర్న్ లతో ఉండబోతోందిట. ఇంతకీ మహేష్ బాబు చేసిన సినిమా ఏంటి, షారూఖ్ చేస్తున్న కొత్త చిత్రం ఏమిటి 

23
Shah Rukh Khan to play a professional assassin in his next film with daughter? in telugu


  2023లో హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్న   బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)గతేడాది తెరపై కనిపించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘కింగ్‌’తో రానున్నట్లు చెప్పారు.   సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘పఠాన్‌’ తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అలాగే ఈ చిత్రంలో షారూఖ్ చేసే పాత్ర గురించి  బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ పాత్ర..మహేష్ బాబు 2005లో చేసిన అతడు సినిమా పాత్ర తరహాలో ఉండబోతోందిట. అంటే  ప్రొఫిషనల్ కిల్లర్ అన్నమాట. 
 

33
Shah Rukh Khan to play a professional assassin in his next film with daughter? in telugu


అప్పట్లో మహేష్ బాబు చేసిన అతడులో ని ప్రొఫిషనల్ కిల్లర్ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. అదే తరహాలో కింగ్ సినిమాలో షారూఖ్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో కథ మాత్రం వేరట. కేవలం పాత్ర వరకే అలా ఉండబోతోందిట.

అలాగే ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా తొలి సారి తెరపై కనిపించనుది. రియల్ లైఫ్ తండ్రి,కూతుళ్లుగా కనిపించనున్నట్లు చెప్తున్నారు. తన కుమార్తెను రక్షించే ప్రొఫిషనల్ కిల్లర్ పాత్ర అని చెప్తున్నారు.

ఎవరు తన కూతురుని టార్గెట్ చేసారనే విషయం కనుక్కోవటం సినిమాలో హైలెట్ గా ఉండబోతోందిట. ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని చెప్తున్నారు. ఫన్ కూడా ఈ సినిమాలో ప్రయారిటీ ఇస్తున్నారట. 
 

Read more Photos on
click me!

Recommended Stories