Pawan Kalyan: ఆ హీరోయిన్ ని కొట్టారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ పై రూమర్, కావాలనే ప్రచారం

Published : Feb 17, 2025, 11:55 AM IST

 Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆల్ టైమ్ హిట్ మూవీస్‌లో ‘ఖుషి’(Khushi) ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌‌జే సూర్య(SJ Surya) 2001లో రూపొందించిన ఈ సినిమా పవన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్‌కు జోడీగా భూమిక(Bhoomika) నటించగా.. సపోర్టింగ్ రోల్‌లో శివాజీ, అలీ కనిపించారు. 

PREV
13
 Pawan Kalyan: ఆ హీరోయిన్ ని కొట్టారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ పై రూమర్, కావాలనే ప్రచారం
Rumour about Pawan Kalyan and Bhumika Chawla at Kushi Shooting


 Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు ఈ స్దాయికి వచ్చాక రూమర్స్ ,గాసిప్స్ పుట్టించటంలో వింతేమీ లేదు. అలాగే ఇవి సోషల్ మీడియా రోజులు. హీరోల మధ్యా , రాజకీయ పార్టీల మధ్యా పోరాటాలు నిరంతరం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి.

అయితే ఇవేమీ లేని రోజుల్లో గాసిప్ కాలమ్స్ పత్రికల్లో ఉండేవి. అలాగే కొన్ని గాసిప్ పత్రికలు ఉండేవి. వాటిల్లో కొంచెం మితి మీరి మరీ గాసిప్ లు రాసేవారు. అలా అప్పట్లో పవన్ కల్యాణ్ పై వచ్చిన గాసిప్ తెగ వైరల్ అయ్యిందని అప్పటి మీడియా జనం చెప్తారు. ఇంతకీ ఏమిటా గాసిప్..అందులో నిజమెంత 

23
Rumour about Pawan Kalyan and Bhumika Chawla at Kushi Shooting


పవన్ కళ్యాణ్ హీరోగా పీక్స్ లో కి వెళ్తున్న టైమ్ అది. ఖుషీ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ముందుకు వెళ్లటం చాలా మందికి నచ్చేది కాదు. పవన్ కళ్యాణ్  నెక్ట్స్  తన అన్న మెగా స్టార్ నే  దాటి పోతారని, మిగతా హీరోలు ఎంత అని  చెప్పుకునేవారు.

ఇక అప్పటి యంగ్ హీరోలకు అయితే ఆయన మింగుడు పడేవారు కాదు. ఆయన యాటిట్యూడ్ , యూత్ లోకి ఆయన వెళ్లటం, తమ సినిమాలు జస్ట్ ఓకే అన్నట్లు ఆడటం గిట్టేది కాదు. దాంతొ కొందరు పనిగట్టుకని పవన్ పై రూమర్స్ క్రియేట్ చేసే పోగ్రామ్ పెట్టుకునేవారు. అలాంటి రూమర్ ఒకటి మనం ఇప్పుడు చూడబోయేది.
 

33
Rumour about Pawan Kalyan and Bhumika Chawla at Kushi Shooting


అదేమిటంటే .. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తో నటించాలంటే హీరోయిన్స్ కు ధైర్యం ఉండాలట. ఎందుకంటే ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవవూ చెప్పలేరట. ఏ విషయంలో అయినా తేడా వస్తే వారి సంగతి అంతేనట. ఖుషీ షూటింగ్ సమయంలో హీరోయిన్ భూమికను పవన్ కొట్టారట. దాంతో ఇలియానా మొదట పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాకు అడుగుతుంటే నో చెప్పేసిందిట. ఇలా ఆ రూమర్ సాగుతుంది.

అయితే పవన్ కల్యాణ్ సెట్ లో చాలా పద్దతిగా ఉంటారని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఓ హీరోయిన్ ని కొట్టారంటే ఎలా నమ్మగలం. అలాగే ఇలియానా ఆయన ప్రక్కన జల్సా చిత్రంలో చేసింది. అది పెద్ద హిట్. ఆమె ప్రక్కన  నటించటానికి హీరోయిన్స్ ఉత్సాహం చూపించేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఎగబడేవారు. అలాంటి సమయంలోనూ ఇలాంటి రూమర్స్ పుట్టించారన్నమాట. అదీ సంగతి. 

Read more Photos on
click me!

Recommended Stories