'రాజాసాబ్': ఫైనాన్సియల్ సమస్యలతో షూటింగ్ ఆపారా?

Published : Mar 10, 2025, 08:42 AM IST

Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందా? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నష్టాల కారణంగా సినిమా ఆలస్యమవుతోందా? దర్శకుడు మారుతి సినిమా విడుదల ఎప్పుడు?

PREV
13
 'రాజాసాబ్': ఫైనాన్సియల్ సమస్యలతో  షూటింగ్ ఆపారా?
Prabhas Raja Saab Film Sinks Under Financial Burden? in telugu


Raja Saab:  ప్రభాస్ (Prabhas)సినిమా అంటే ప్యాన్ ఇండియా మార్కెట్లో వచ్చే బజ్ , క్రేజ్ వేరు.  అయితే ప్రభాస్ చేస్తున్న వాటిలో అతి తక్కువ బజ్ ఉన్న సినిమా మాత్రం 'రాజాసాబ్'.(The Rajasaab Movie). ఈ సినిమా ప్రారంభం నుంచి ఫ్యాన్స్ ఇష్టపడలేదు.  

కానీ తర్వాత వచ్చిన సినిమా ప్రమోషన్  కంటెంట్ కాస్త ఎక్సపెక్టేషన్స్ ఏర్పడుచుకున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్దితి నెలకొంది. అంతేకాదు ఈసినిమాపై రోజుకో వార్త మీడియాలో వస్తోంది.

తాజాగా ఈ సినిమా ఫైనాన్సియల్ సమస్యల్లో ఇరుక్కుందని ప్రచారం మొదలైంది.సినిమాకు మొదట అనుకున్న  బడ్జెట్ కాకుండా పెంచుకుంటూ పోయారని దాంతో బడ్జెట్  ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఈ వార్తల్లో నిజం ఎంత  
 

23
Prabhas Raja Saab Film Sinks Under Financial Burden? in telugu


తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలుగుతున్న  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరస సినిమాలు ప్రకటిస్తూ వచ్చింది. చాలా సినిమాలు రిలీజ్ చేసింది. అయితే సక్సెస్ రేటు మాత్రం లేకుండా పోయింది. లాస్ట్ ఇయిర్ అయితే ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు.  

గతేడాది పెద్ద మొత్తంలో నష్టపోయానని టీజీ విశ్వప్రసాద్ స్వయంగా అంగీకరించారు. ఈ నష్టాలే ప్రొడక్షన్ హౌస్ లో రెడీ అవుతున్న తాజా  ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపుతోందని చెప్తున్నారు. ఆ క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో  లైనప్‌లో ప్రభాస్ నటించిన రాజా సాబ్ అతిపెద్ద చిత్రం.

ప్రొడక్షన్ హౌస్ నష్టాల్లో ఉండటం, మార్కెట్‌లో భారీ ఆర్థిక సంక్షోభం,సక్సెస్ రేటు లేకపోవటం వల్ల రాజా సాబ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడని వార్తలు వస్తున్నాయి. యూనియన్స్ కు,  ఇతర సాంకేతిక నిపుణులకు బకాయిల  చెల్లించని  కారణంగా ఫిబ్రవరిలో ప్లాన్ చేసిన షెడ్యూల్‌లు కాన్సిల్ చేసారని చెప్తున్నారు. దాంతో  హను రాఘవపూడి సినిమా కోసం ప్రభాస్ ఆ డేట్స్ కేటాయించాల్సి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.

33
Prabhas Raja Saab Film Sinks Under Financial Burden? in telugu


దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అని గతంలో ప్రూవ్ అయ్యింది. దాంతో అలాంటి మరో కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'.  మొదట అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు.

కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు. మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ పెండింగ్ ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది.  

అదే సమయంలో ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. ఏది నిజం ..ఏది అబద్దం అనేది టీమ్  వాళ్లే క్లారిటీగా చెప్పగలరు. 

Read more Photos on
click me!

Recommended Stories