' డాకూ మహారాజ్ ' ప్రీ రిలీజ్ ఈవెంట్: ఎప్పుడు? ఎక్కడ? గెస్ట్ లు ఎవరు

First Published | Dec 23, 2024, 1:08 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈవెంట్‌కు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ న‌టించిన క్రేజీ  మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్ర తెర‌కెక్కుతోంది. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా క‌నిపించ‌బోతున్నారు.

తమన్ సంతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య లు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం 2025 జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ జరగనుందనే విషయాలు నిర్మాత రివీల్ చేసారు.
 


తాజాగా నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగ‌వంశీ మాట్లాడుతూ.. జ‌న‌వ‌రి 2న ఈ చిత్ర ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.  జ‌న‌వ‌రి 4న అమెరికాలో ఓ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నామ‌ని, అక్క‌డ ఓ సాంగ్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లుగా తెలిపారు. జ‌న‌వ‌రి 8న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించేందుకు సన్నాహ‌కాలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ జరపనున్నట్లు తెలిపారు. 
 



మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈవెంట్కి వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  
 


 ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్య సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. 
 


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు . వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు  భావిస్తున్నారు.
 

Latest Videos

click me!