ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ 10 భాషల్లో ఏకంగా 90 కి పైగా సినిమాలు చేసిన నటి. 50 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతోన్న తార ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోయిన హీరోయిన్, వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పొలిటికల్ కెరీర్ ను కొనసాగిస్తోంది. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గా కొనసాగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు నగ్మ. తన కెరీర్‌లో సక్సెస్ తో పాటు పలు అఫైర్ల రూమర్లు కూడా చూసిన నగ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.
25
నగ్మ సినీ కెరీర్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 10 భాషల్లో 90 కి పైగా సినిమాలు చేసింది నగ్మ. అంతేకాదు సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఆమె స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆమె, బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ సంపాదించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ హీరోలతో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ’భాషా’, ’రౌడీ అల్లుడు’, ’రిక్షావోడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుంది. సౌత్ ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, నగ్మకు ఓ అభిమాని గుడి కూడా కట్టాడు.
35
నగ్మ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్
నగ్మ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ – హిందూ, తల్లి షామా – కాజీ ముస్లిం. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యం కలిగింది. షామా–అరవింద్ 1969లో వివాహం చేసుకున్నారు. నగ్మ పుట్టిన సమయంలోనే ఆమె తల్లీ తండ్రులు విభేదాల కారణంగా 1974లో విడిపోవగా, తర్వాత షామా సినీ నిర్మాత చందర్ సదానాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జ్యోతిక, రోషిణి (రాధిక) అనే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
నగ్మ చెల్లెల్లు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు గా కొనసాగాయారు. మరీ ముఖ్యంగా నగ్మ మొదటి చెల్లెలు జ్యోతిక సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నగ్మ రెండో చెల్లెలు రోషిణి కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. మరోవైపు నగ్మ గురించి చూసుకుంటే తన కెరీర్ ప్రారంభ దశ నుంచి తండ్రికే ఎక్కువగా దగ్గరగా ఉండేది. 2005లో ఆయన మరణించే వరకు ఆయనతో నగ్మ ఎక్కువ సమయం గడిపింది.
55
ఒంటరి జీవితం గడుపుతోన్న నగ్మ
నగ్మ ఫిల్మ్ కెరీర్ లో పెద్దగా ప్లాప్ సినిమాలు లేవు. ఆమెకు హీరోయిన్ గా కెరీర్ పూర్తి అవ్వగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన ఆమె.. ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. ఆమె స్టార్‌డమ్ పీక్‌లో ఉన్న సమయంలో క్రికెటర్ సౌరవ్ గంగూలీతో అఫైర్ రూమర్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. మరో ఇద్దరు స్టార్లతో కూడా ఆమె పేరు వినిపించింది. కానీ అవి నిజమా కాదా అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం నగ్మ రాజకీయాల్లో బిజీగా ఉంటూ, ఒంటరి జీవితం గడుపుతోంది.