మీ ఫోన్ తరచూ వేడెక్కుతోందా? ఈ 7 చిట్కాలను పాటిస్తే ఏ ప్రాబ్లం వుండదు

First Published Sep 5, 2024, 9:12 PM IST

మీ మొబైల్ ఫోన్ తరచూ వేడెక్కుతోందా? ఇది మీ ఒక్కరి సమస్యే కాదు చాలామంది సాధారణంగానే ఈ పరిస్థితిని ఎదురవుతుంటుంది. దీనిని పరిష్కరించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. అవెెంటో తెలుసుకుందాం. 

స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం

నేటి టెక్ జమానాలో స్మార్ట్‌ఫోన్‌లు మనకు ఎంతో అవసరం. ప్రతిదీ ఫోన్ లోనే అందుబాటులో వుంటుంది. అయితే ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలామంది ఫోన్లు తరచుగా వేడెక్కుతుంటాయి. ఇది మీ ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తుంది...కొన్నిసార్లు ఫోన్ పూర్తిగా పాడయిపోవచ్చు. 

ఇలా మీ ఫోన్ పై లోడ్ ఎక్కవై వేడెక్కగానే భయపడిపోకండి... తొందరపడి కొత్త ఫోన్ కొనుక్కోడానికి ప్లాన్ చేయకండి.  వేడెక్కుతున్న మీ స్మార్ట్‌ఫోన్‌ను చల్లబరచడానికి, భవిష్యత్తులో ఇలా జరగకుండా నిరోధించడానికి కొన్ని సులభమైన చిట్కాలున్నాయి.

ఉపయోగించని యాప్‌లను మూసివేయండి

చాలామందికి అవసరం వున్నా లేకున్నా ఫోన్ ను యాప్ లలో నింపేస్తుంటారు. దీనివల్ల ఫోన్ పై లోడ్ ఎక్కువై వేడెక్కె అవకాశాలుంటాయి.  కొన్ని యాప్‌లు ఉపయోగించకున్నా బ్యాగ్రౌండ్ లో నడుస్తూనే వుంటాయి. అలాంటి యాప్స్ ను గుర్తించి వాటిని మూసివేయాలి.

Latest Videos


ఫ్లైట్ మోడ్

మీ ఫోన్ వేడెక్కితే కంగారుపడిపోకండి.... వెంటనే ఫ్లైట్ మోడ్‌ని ఆన్ చేయండి. ఇది మొబైల్‌ను త్వరగా చల్లబరచడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను ఆపేస్తుంది. ఇది బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా మొబైల్ వేడెక్కడాన్ని కూడా తగ్గిస్తుంది.

డిస్ ప్లే బ్రైట్ నెస్ తగ్గించండి

మీ ఫోన్  డిప్ ప్లే బ్రైట్ నెస్ తగ్గించుకొండి. బ్రైట్ నెస్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఛార్జ్ ఖర్చవుతుంది, తద్వారా బ్యాటరీ వేడెక్కుతుంది.

ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించండి

మొబైల్ వెంట వచ్చే నాణ్యమైన ఛార్జర్‌ని మాత్రమే ఉపయోగించండి. పాడయిపోయిన, నకిలీ ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల కూడా సెల్ ఫోన్‌ వెడెక్కుతుంది. 

యాప్‌లను అప్‌డేట్ చేయండి

మీరు ఉపయోగించే యాప్ లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకొండి, దీనివల్ల మీ ఫోన్ పనితీరు మెరుగుపడటమే కాదు బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. 

కవర్ తొలగించండి

ఫోన్ యొక్క కవర్‌ను తీసివేయడం వల్ల కూడా హీటింగ్ ను తగ్గించవచ్చు. కాబట్టి ఫోన్ వేడెక్కిన వెంటనే బ్యాక్ కవర్ తీసేసి కొద్దిసేపు పక్కనపెట్టండి.  

click me!