రూ.10,000 లోపు బెస్ట్ మొబైల్స్: 5G స్మార్ట్‌ఫోన్లు కూడా!

First Published | Sep 4, 2024, 10:01 PM IST

సెప్టెంబర్ 2024లో మార్కెట్ లోకి రూ.10,000 లోపు ఉత్తమ మొబైల్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం.

రూ.10,000 లోపు బెస్ట్ మొబైల్స్

ఈ 5జి జనరేషన్ స్మార్ట్‌ఫోన్లను మార్చడం సర్వసాధారణంగా మారిపోయింది. మార్కెట్లో ఏదైనా కొత్త మొబైల్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సెప్టెంబర్ 2024 అనేది స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒక అద్భుతమైన నెలగా చెప్పవచ్చు.

ఐఫోన్ 16 సిరీస్ వంటి ఖరీదైన ఫోన్లే కాదు బడ్జెట్ ధరల్లో కూడా అనేక ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్లు ఈ నెలలోనే లాంచ్ అయ్యాయి... మరికొన్ని లాంచ్ కానున్నాయి. ఇలా ఈ నెలలో రూ.10,000 లోపు లభించే స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లు, ధరలను పరిశీలిద్దాం.

టెక్నో స్పార్క్ గో 1

టెక్నో స్పార్క్ గో 1

టెక్నో నుండి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ గో 1 సెప్టెంబర్ 3న విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.7,299 నుండి ప్రారంభమవుతుంది. స్పార్క్ గో 1 ఆక్టా-కోర్ యూనిసోక్ T615 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది రోజువారీ వినియోగంతో పాటు సాధారణ గేమింగ్ కోసం మంచి ఎంపిక.

ఇది 8GB RAM తో వస్తుంది. మల్టీ టాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది,  64GB ఇంటర్నల్ మెమోరి సామర్థ్యాన్ని కలిగివుంది... దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా మరింతగా పెంచుకోవచ్చు.

టెక్నో స్పార్క్ గో 1 ఫోన్ 5,000mAh బ్యాటరీతో వచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు. ఇది నిత్యం ప్రయాణాల్లో ఉండే వినియోగదారులకు అనువైనది. ఇది 15W ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా వేగంగా లేకపోయినా, ఈ ధర పరిధిలో మంచిది.

Latest Videos


ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి ఈ నెలలో విడుదల కానున్న మరో అద్భుతమైన ఫోన్. ఇది సెప్టెంబర్ 5న విడుదలకానుంది. ప్రారంభ ధర రూ. 12,999 ఉన్నప్పటికీ త్వరలో తగ్గింపు ఆఫర్లలో రూ.10,000 లోపు లభిస్తుందని భావిస్తున్నారు.

హైస్పీడ్ 5G నెట్‌వర్క్ పొందాలని వున్నా ఎక్కువ ఖర్చు చేయలేని వినియోగదారులకు ఈ 5G-ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ అనువైనది. 10000 లోపు మంచి 5జి మొబైల్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ఇన్ఫినిక్స్ హాట్ 50 48MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది మంచి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది అలాగే మంచి ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెద్ద డిస్‌ప్లే, సరైన బ్యాటరీ లైఫ్, విస్తరించదగిన నిల్వ ఎంపికలు వంటివి ఉంటాయని భావిస్తున్నారు.

శామ్సంగ్ గెలాక్సీ ఎ06

శామ్సంగ్ గెలాక్సీ ఎ06

రూ.10,000 లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో శామ్సంగ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ06 కూడా దీనికి మినహాయింపు కాదు. శామ్సంగ్ యొక్క ప్రసిద్ధ A-సిరీస్ శ్రేణిలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 3, 2024న విడుదలైంది. దీని ధర రూ.9,999. ఇది రూ.10,000 లోపు విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తుంది.

Galaxy A06 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మంచి పనితీరును అందించే సామర్థ్యం గల చిప్‌సెట్. ఇది రోజువారీ వినియోగానికి, తేలికపాటి గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

Galaxy A06 దాని 50MP ప్రైమరీ కెమెరాతో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఫీచర్ ఈ ధర పరిధిలో చాలా అరుదు. ఈ కెమెరా సెటప్ తో అధిక నాణ్యత గల చిత్రాలను తీయవచ్చు. ఇది బడ్జెట్ ధరలో కెమెరా ప్రియులకు మంచి ఎంపిక. 

ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఇది రోజంతా ఎలాంటి ఆటంకం లేకుండా ఫోన్ ను వినియోగించవచ్చన్న మాట. ఇలా మంచి బ్యాటరీ, సామర్థ్యం గల ప్రాసెసర్, ఆకర్షణీయమైన కెమెరాతో శామ్సంగ్ గెలాక్సీ ఎ06 మార్కెట్ లోకి వచ్చింది. .

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు

రూ.10,000 లోపు విభాగంలో అనేక మొబైల్ బ్రాండ్లు ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. మీరు శక్తివంతమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ లేదా 5G కనెక్టివిటీని కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నా, ఈ ధర పరిధిలో అందరికీ తగినది ఏదో ఒకటి ఉంటుంది.

Tecno Spark GO 1, Samsung Galaxy A06, Infinix Hot 50 5G బడ్జెట్ విభాగంలో గొప్ప ఎంపికలు. మరన్ని స్మార్ట్‌ఫోన్‌లు నిరంతరం విడుదలవుతుండటంతో, రూ.10,000 లోపు విభాగం మునుపటి కంటే పోటీ పెరిగింది. ఇది మొబైల్ ప్రియులకు మంచి వార్త, ఎందుకంటే వారు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను పొందవచ్చు.

click me!