ఈ ఐఫోన్ ధర అక్షరాల 11 లక్షలు.. అవును నిజమే, అంతా ధర ఎందుకొ తెలుసా.. ?

First Published | Dec 2, 2020, 12:58 PM IST

ఈ ఫోన్ చూడటానికి ఐఫోన్ లాగానే కనిపించిన దీని ధర ఒక కారు కంటే ఎక్కువ.. అవును నిజమే.. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఒకేలాగానే ఉంటాయి కానీ అంతా ధర ఎందుకు అనుకుంటున్నారా..  ఎందుకంటే దీనిని తయారు చేసింది బంగారంతో. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కేవియర్, గోటి ఎడిషన్ గెలాక్సీ ఫోల్డ్, టెస్లా సైబర్‌ట్రక్-ప్రేరిత ఐఫోన్ 11 ప్రోలకు ప్రసిద్ది చెందింది. అయితే తాజాగా కేవియర్ సంస్థ కొత్త కస్టమైజ్డ్ ఐఫోన్ 12 ప్రో మోడల్‌ను విడుదల చేసింది.ఈ కస్టమైజ్డ్ ఐఫోన్ 12 ప్రోని సాండ్స్ ఆఫ్ టైమ్ పరుతో పిలుస్తారు. ఈ లిమిటెడ్-రన్ మోడల్ పై  హవర్ గ్లాస్ డిజైన్‌లో జో బిడెన్, డోనాల్డ్ ట్రంప్ ఫోటోలు కనిపిస్తాయి.

డిజైన్ఫోన్ కేసుకి టైటానియం ఫినిషింగ్ ఇచ్చారు, ఫోన్ వెనుక భాగంలో అమెరికన్ జెండా ఫోటోతో పాటు 50 నక్షత్రాలు, ఏడు చారలతో ఉంటుంది. వెనుక మధ్య భాగంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ట్రంప్ ఫోటోలతో స్వచ్చమైన 750 బంగారు గింజలతో హవర్ గ్లాస్ డిజైన్‌ ఏర్పాటు చేశారు. ఈ కస్టమ్ హ్యాండ్‌సెట్లు కేవలం ప్రపంచవ్యాప్తంగా 46 మాత్రమే ఉన్నాయి, ఇది అమెరికాలోని మొత్తం అధ్యక్షుల చరిత్రను సూచిస్తుంది.
డిజైన్ అండ్ డిస్ ప్లేస్పెసిఫికేషన్ల పరంగా ఐఫోన్ 12 ప్రో సాండ్స్ ఆఫ్ టైమ్ స్టాండర్డ్ ఐఫోన్ 12 ప్రో లాగానే ఉంటుంది. 6.1-అంగుళాల పూర్తి- హెచ్‌డి ప్లస్ (1170x2532 పిక్సెల్స్) ఓ‌ఎల్‌ఈ‌డి స్క్రీన్, ఫేస్ ఐడి ఉంది. ముందు, వెనుక కెమెరా సెటప్ లో ఎలాంటి మార్పు లేదు. వెనుక భాగంలో మూడు 12ఎం‌పి కెమెరా లెన్సులతో పాటు ఒక లిడార్ సెన్సార్, ముందువైపు 12ఎం‌పి సెల్ఫీ షూటర్ కెమెరా ఉంది.

ఇంటర్నల్ ఫీచర్స్ఐఫోన్ 12 ప్రో సాండ్స్ ఆఫ్ టైమ్ హెక్సా-కోర్ ఏ14 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది, దీనికి 512జి‌బి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఐ‌ఓ‌ఎస్ 14తో పనిచేస్తుంది, 2815mAh బ్యాటరీ, 20W వైర్‌ ఛార్జింగ్ తో పాటు 15W మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై6, బ్లూటూత్ 5.0, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 5జి సపోర్ట్, లైటెనింగ్ పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది.
దీని ధర ఎంతంటే ?ఐఫోన్ 12 ప్రో సాండ్ ఆఫ్ టైమ్ 128 జిబి వేరియంట్‌ ధర 14,900 డాలర్లు అంటే ఇండియాలో సుమారు రూ. 11,04,700 వద్ద ప్రారంభమవుతుంది. 512 జిబి మోడల్‌కు 15,590 డాలర్లు అంటే సుమారు రూ. 11,55,850 వరకు ఉంటుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఐఫోన్ 12 ప్రో మాక్స్ రూపంలో కూడా పొందవచ్చు. దీని ధర 18,360 డాలర్లు అంటే సుమారు రూ. 13,61,200 వద్ద ధర ప్రారంభమవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు Caviar's webite. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు.https:caviar.globaliphone-12sands-of-time

Latest Videos

click me!