Oppo Reno 16: త‌క్కువ ధ‌ర‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. చూడ్డానికి అచ్చం ఐఫోన్‌లాగే

Published : May 10, 2026, 02:05 PM IST

Oppo Reno 16: ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ ఒప్పో చైనా మార్కెట్లోకి ఈ నెలాఖ‌రున కొత్త ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఒప్పో రెనో 16 ప్రో పేరుతో రానున్న ఈ ఫోన్‌కి సంబంధించిన వివ‌రాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

PREV
14
త్వ‌ర‌లోనే మార్కెట్లోకి

చైనా మార్కెట్‌లో ఈ నెల చివర్లో విడుదలకు సిద్ధమవుతున్న ఒప్పో రెనో 16 ప్రో స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో కూడా అడుగుపెట్టనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ తాజాగా భారతీయ BIS (Bureau of Indian Standards) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అలాగే ఇండోనేషియా TKDN డేటాబేస్‌లో కూడా లిస్ట్ కావడంతో గ్లోబల్ లాంచ్‌కు కంపెనీ సిద్ధమవుతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. Oppo Reno 16 Pro ‘CPH2863’ అనే మోడల్ నంబర్‌తో BIS, TKDN సర్టిఫికేషన్ సైట్లలో కనిపించినట్లు సమాచారం. ఈ లిస్టింగ్‌ల ద్వారా ఫోన్‌కు 2G, 3G, 4G, 5G నెట్‌వర్క్‌ల సపోర్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉండ‌నున్నాయంటే.

24
భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ వచ్చే అవకాశం

లీకుల ప్రకారం ఒప్పో రెనో 16 Proలో 6.78 అంగుళాల LTPO డిస్‌ప్లే ఉండొచ్చు. ఇది 1.5K రిజల్యూషన్‌తో రావచ్చని సమాచారం. LTPO ప్యానెల్ వాడటం వల్ల స్మూత్ రిఫ్రెష్ రేట్‌తో పాటు బ్యాటరీ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీ ఇచ్చే స్థాయి ప్రాసెసర్‌గా భావిస్తున్నారు. ఫోన్‌లో గరిష్ఠంగా16 జీబీ ర్యామ్‌, 1 టీబీ వరకు స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. దీంతో మల్టీటాస్కింగ్, గేమింగ్, హెవీ యాప్ వినియోగం మరింత వేగంగా సాగవచ్చు.

34
200MP కెమెరా, 7000mAh బ్యాటరీ హైలైట్

Oppo Reno 16 Proలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇవ్వొచ్చని సమాచారం. కెమెరా హార్డ్‌వేర్ పరంగా ఇది ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లకు సవాల్ విసిరేలా ఉండొచ్చని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బ్యాట‌రీ సెట‌ప్ అచ్చంగా ఐఫోన్‌ను పోలిన‌ట్లు ఉండ‌నుంది.

ఇక బ్యాటరీ విషయంలో కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలవొచ్చు. 7000mAh భారీ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వొచ్చని లీకులు చెబుతున్నాయి. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉండే అవకాశముంది. ఎక్కువసేపు ఫోన్ వినియోగించే వారికి ఇది మంచి ఎంపిక కావొచ్చు.

44
Reno 15 Proతో పోలిస్తే ఎలాంటి మార్పులు?

గత మోడళ్లతో పోలిస్తే Reno 16 Proలో పెద్ద బ్యాటరీ, మెరుగైన చిప్‌సెట్, హై రిజల్యూషన్ కెమెరా వంటి కీలక అప్‌గ్రేడ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనితీరు, కెమెరా, బ్యాటరీ లైఫ్ అంశాల్లో ఈ ఫోన్ గణనీయమైన మార్పులతో రావొచ్చని అంచనా. ఇప్పటికే Reno 14 Pro వాడుతున్న వినియోగదారులకు ఇది మంచి అప్‌గ్రేడ్‌గా మారవచ్చు. అయితే Reno 15 Pro యూజర్లకు మార్పులు కొంత పరిమితంగానే అనిపించే అవకాశం ఉంది. ధర సరైన స్థాయిలో ఉంటే ప్రీమియం మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చు. ధ‌ర విష‌యానికొస్తే.. భారత్‌లో ఒప్పో రెనో 16 సిరీస్ ధర సుమారు రూ.45,000 నుంచి రూ. 65,000 మధ్యలో ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories