Motorola Moto G37: బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి మోటోరోలో మోటో జీ37 5జీ స్మార్ట్ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది.
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటంతో స్క్రీన్‌కు మెరుగైన భద్రత లభిస్తుంది.
25
మెరుగైన పనితీరు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. రోజువారీ పనులు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ వంటి కార్యకలాపాలను సులభంగా నిర్వహించగలదు. అవసరమైతే microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే ఈ ఫోన్ అసలు ధర రూ. 24,999కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,379కి లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
35
అదిరిపోయే కెమెరా
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. PDAF సపోర్ట్ ఉండటంతో ఫోకస్ వేగంగా పనిచేస్తుంది. 2K వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సోషల్ మీడియా కోసం ఫోటోలు, 2K వీడియో రికార్డింగ్‌కు ఇది ఉపయోగపడుతుంది.
ఈ ఫోన్‌లో 5200mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందించేలా రూపొందించారు. 20W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో త్వరగా ఛార్జ్ అవుతుంది. అలాగే 6W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.
55
ఇతర ముఖ్యమైన ఫీచర్లు
Motorola Moto G37 5Gలో IP64 డస్ట్, వాటర్ స్ప్లాష్ ప్రొటెఓన్ ఉంది. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటంతో సాధారణ వినియోగంలో మెరుగైన మన్నికను అందిస్తుంది. ఇందులో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆటమ్స్ స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.4, Wi-Fi 5 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే Android 16 ఆధారిత Moto Hello UIతో వస్తోంది. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో పాటు మూడు సంవత్సరాలపాటు భద్రతా అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.