సునీల్ ఛెత్రి అరుదైన ఘనత.. అత్యధిక గోల్స్ కొట్టినవారిలో రెండో స్థానానికి..

First Published | Jun 22, 2023, 10:38 AM IST

SAFF Championship 2023: భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్ చేయడంతో అతడు  అత్యధిక గోల్స్ కొట్టినజాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 

Sunil Chhetri

భారత ఫుట్‌బాల్ సారథి  సునీల్ ఛెత్రి అరుదైన  ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఆధ్వర్యంలో బుధవారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో  హ్యాట్రిక్ సాధించడంతో   ఛెత్రి  అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ కొట్టినవారిలో తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు.  

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో  మూడు గోల్స్ కొట్టడం ద్వారా ఛెత్రి ఇంటర్నేషనల్ గోల్స్ సంఖ్య 90కు చేరింది. ఈ క్రమంలో అతడు ఆసియా లో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు.  మలేషియాకు చెందిన దిగ్గజ ఆటగాడు మొక్తార్ దహారి (142 మ్యాచ్ లలో 89 గోల్స్) రికార్డును అధిగమించాడు. 


Image credit: FSDL

దహారి  142 మ్యాచ్ లలో 89 గోల్స్ చేయగా  ఛెత్రికి 138 మ్యాచ్ లోనే ఈ ఘనత సాధ్యమైంది.  కాగా ఆసియాలో  ఛెత్రి  కంటే ముందు ఇరాన్ ఫుట్‌బాల్ దిగ్గజం  అలీ డాయ్.. 109 గోల్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు.  డాయ్.. 149 మ్యాచ్ లలో  109 గోల్స్ చేశాడు.  డాయ్, ఛెత్రి మధ్య  19 గోల్స్ తేడా ఉంది.  

ఇక అంతర్జాతీయ స్థాయిలో  చూస్తే ఛెత్రి.. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.  ఈ జాబితాలో పోర్చుగల్ వెటరన్  ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. 200 మ్యాచ్‌లలో  123 గోల్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  రెండో స్థానంలో  అలీ డాయ్ (109) ఉన్నాడు. 

Lionel Messi

థర్డ్  ప్లేస్‌లో అర్జెంటీనా  స్టార్ లియోనల్ మెస్సీ  ఉన్నాడు.  మెస్సీ.. అర్జెంటీనా తరఫున  175 మ్యాచ్ లు ఆడి  103 గోల్స్ సాధించాడు. మెస్సీ తర్వాత  నాలుగో స్థానం ఛెత్రి (90 గోల్స్) దే కావడం గమనార్హం.   ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ కంటే ముందు  మెస్సీ, ఛెత్రి మధ్య గోల్స్ తేడా తక్కువగానే ఉండేది. కానీ ఫిఫాలో మెస్సీ.. సూపర్ డూపర్ గోల్స్ తో  సెంచరీ   మైల్ స్టోన్ ను దాటాడు. 

Latest Videos

click me!