నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవారు అప్పుడప్పుడైనా వెజ్ ఫుడ్ రుచి చూస్తారేమో కానీ.. కంప్లీట్ గా వెజిటేరయన్స్ మాంసాహారం అస్సలు ముట్టరు. ఆ ఫుడ్ తినడానికి వాళ్లు అస్సలు ఆసక్తి చూపించరు.
undefined
అయితే.. చాలా మంది శాకాహారాలు.. వాళ్లకు తెలీకుండానే కొన్ని రకాలా మాంసాహారాన్ని తినేస్తున్నారన్న విషయం మీకు తెలుసా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మీరు తినే శాకాహారం.. పూర్తిగా నాన్ వెజ్. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..
undefined
సలాడ్స్.. ప్రఖ్యాత సీజర్ సలాడ్ శాకాహారులు ఎక్కువగా ఆనందించే వంటకం. పాలకూర మరియు క్రౌటన్ల (బేక్ చేసిన బ్రెడ్) నుంచి తయారైన దీనిని పర్మేసన్ చీజ్, నిమ్మరసం మరియు ఆలివ్ నూనెతో ధరిస్తారు. అయితే.. దీనిలో మీరు ఇష్టపడే రుచికరమైన సాస్ ని కోడిగుడ్లతో తయారు చేస్తారు. అంటే.. మీకు తెలీకుండానే మీరు గుడ్డు తింటున్నారు.
undefined
చీజ్ బాల్స్.. మీరు చీజ్స్ లవర్సా..? చీజ్ వెజ్ ఫుడ్ అందరూ భ్రమపడుతుంటారు. అయితే.. దీనిని జంతువుల రెన్నెట్ ఉపయోగించి తయారుచేస్తారు. సాంప్రదాయ జంతువుల రెన్నెట్ అంటే.. దూడలు, గొర్రెలు లేదా మేకలు ఘనమైన ఆహారాన్ని తీసుకునే ముందు పేగు నుండి పొందిన ఎంజైమ్. వాటి నుంచి చీజ్ తయారు చేస్తారు.
undefined
సూప్.. అన్ని సూప్స్ కాదు కానీ.. కొన్ని సూప్స్ లో నాన్ వెజ్ కలుస్తుంది. మనం ఇంట్లో కూరగాయలతో చేసుకునే సోప్ పూర్తి గా శాకాహారమే. కానీ.. బయట లభించే మాకో సూప్ లాంటి వాటిలో.. ఉపయోగించే సాస్ లను చేపలతో తయారు చేస్తారు. సూప్ లలో వాడే దాదాపు సాస్ లన్నీ చేపలు లేదా రొయ్యలతో తయారు చేస్తారు.
undefined
ఈడిబుల్ ఆయిల్స్.. ఇవి వంటకు ఉపయోగించడం చాలా మంచిది. ఈ ఆయిల్ తో చేసిన వంట తినడం వల్ల గుండె పనితీరు బాగుంటుంది. అయితే.. ఇది కూడా పూర్తిగా నాన్ వెజ్ అన్న విషయం గుర్తించాలి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్.. చేప నుంచి తీసి ఈ నూనెల్లో ఉపయోగిస్తారు.
undefined
చక్కెర( షుగర్) : చక్కెర లేకుండా ‘మాంసాహార’ ఆహార పదార్థాల జాబితా అసంపూర్ణంగా ఉంటుంది. అసలు షుగర్ తెలుపు రంగులోకి ఎలా వస్తుందో మీకు తెలుసా..? దానిని ప్రాసెస్ చేసే సమయంలో బోన్ చార్ కలుపుతారు. అంటే జంతువుల ఎముకల పొడి. దానివల్లే అది తెల్లగా మారుతుంది.
undefined
వైన్, బీర్.. మీరు నిజంగా శాకాహారులైతే వీటిని కూడా ముట్టుకోవద్దు. చాలా రకాల బీర్, వైన్ లలో ఉష్ణమండలాల చేపల మూత్రాశలాయాల నుంచి తీసిన పదార్థాలను కలుపుతారు.
undefined
ఒక్క ఆహార పదార్థాలు మాత్రమే కాదు.. కొన్ని రకాల మందులు కూడా మాంసాహారమే. మనకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే చాలా మందులు జంతువుల నుంచే తయారు చేస్తారు. కొన్ని జంతువుల కండరాల నుంచి తయారు చేస్తే.. మరికొన్ని పంది చర్మం నుంచి కూడా తయారు చేస్తారు.
undefined