Vada Recipe: కరకరలాడే క్రిస్పీ కొబ్బరి వడ.. సింపుల్ గా ఇలా చేసేయండి

Published : Mar 13, 2025, 11:13 AM IST

Crispy Coconut Vada Recipe: మినపప్పుతో చేసిన వడలు తినీతినీ బోరు కొట్టిందా? అయితే కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే కొబ్బరి వడ ట్రై చేయండి. అద్భుతమైన టేస్ట్ ఉండటం వల్ల ఈ వడలను మీ ఇంట్లో వాళ్లంతా ఇష్టపడతారు. మిమ్మల్ని మెచ్చుకుంటారు. కొబ్బరి వడలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Vada Recipe: కరకరలాడే క్రిస్పీ కొబ్బరి వడ.. సింపుల్ గా ఇలా చేసేయండి

దక్షిణ భారతదేశంలో తినే ఆహారాల్లో వడకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ టిఫెన్ సెంటర్లలో వడ తయారు చేస్తారు. కొన్ని హనుమాన్ ఆలయాల్లో వడలను ప్రసాదంగా కూడా ఇస్తారు. సౌత్ ఇండియాలో అంత ఫేమస్ ఈ వడ. 

బయట క్రిస్పీగా లోపల మృదువుగా ఉండే కొబ్బరి వడ రుచి, వాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా ఈ వంటకాన్ని ఇళ్లలో ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తయారు చేస్తారు.

25

కొబ్బరి వడ తయారీకి కావాల్సిన పదార్థాలు :

శనగపప్పు - 1 కప్పు (2 గంటలు నానబెట్టింది)
కొబ్బరి తురుము - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
చిన్న ఉల్లిపాయలు    - 5 (తరిగినవి)
ఇంగువ - కొద్దిగా
జీలకర్ర - 1/2 టీస్పూన్
కరివేపాకు -2 రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
బియ్యం పిండి - 1 టీస్పూన్ (క్రిస్పీనెస్ కోసం)
నూనె - వేయించడానికి సరిపడా

35

కొబ్బరి వడ తయారీ విధానం :

శనగపప్పును 2 గంటలు నానబెట్టి, నీటిని వడకట్టాలి. మిక్సీలో పచ్చిమిర్చి, ఇంగువ వేసి, కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. 
రుబ్బిన పిండిలో కొబ్బరి తురుము, తరిగిన ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి.
వడ విరిగిపోకుండా, మృదువుగా, క్రిస్పీగా రావాలంటే మిశ్రమం ఎక్కువ తడిగా ఉండకూడదు.
ఒక పాన్ లో నూనె వేడి చేసి, వడలను వేసి, మధ్యమధ్యలో తిప్పుతూ, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

45

ఇలా వడ్డించుకుంటే సూపర్ టేస్ట్:

వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, కారంగా ఉండే పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో కలిపితింటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ప్రత్యేక విందులలో పప్పు వడకు బదులుగా కొబ్బదివడ తయారు చేసి వడ్డించుకుంటే బాగుంటుంది.

కొబ్బరి వడ ప్రత్యేకతలు :

సాధారణంగా గ్రామాల్లో పండుగ రోజుల్లో దీనిని ప్రత్యేక వంటకంగా చేయడం ఆనవాయితీ.
కొబ్బరి కలపడం వల్ల వడ కొద్దిగా చల్లగా, సువాసనగా ఉంటుంది.
కొబ్బరి శరీరానికి మంచి కొవ్వును అందిస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి పోషకాహారం. 

55

రుచిని పెంచడానికి ఇలా చేయండి:

కొబ్బరి ఎక్కువగా వేసినప్పుడు, వడ మృదువుగా ఉంటుంది. కానీ ఎక్కువ కొబ్బది వేస్తే నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది. అందువల్ల సరపడా వేయండి. 
బియ్యం పిండి కలపడం వల్ల, వడ మరింత క్రిస్పీగా ఉంటుంది.
నూనెలో వేసే ముందు, స్టవ్ ను మీడియం మంటలో ఉంచాలి. ఎక్కువ వేడిలో వడ బయట మాత్రమే వేగి లోపల మెత్తగా ఉంటుంది.
వడ మిశ్రమంలో నీరు ఎక్కువగా ఉంటే, కొద్దిగా శనగపిండి కలుపుకోవచ్చు.

click me!

Recommended Stories