చాలామంది వ్యాపారులు పాత ఫోన్లు కొంటామని గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ఉంటారు. పాడైన మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం లేదా వంద, రెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తుంటారు. ఈ పాత ఫోన్లను ఎందుకు కొంటున్నారు, వాటితో ఏం చేస్తారు అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
పాత ఫోన్లలో ఉన్న ఉపయోగపడే భాగాలే ఈ వ్యాపారులకు ప్రధాన లాభం. ఒక మొబైల్ ఫోన్ పూర్తిగా పనిచేయకపోయినా, అందులోని కొన్ని భాగాలు మాత్రం బాగానే ఉంటాయి. స్క్రీన్, బ్యాటరీ, కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్, చార్జింగ్ పోర్ట్, ఐసీలు వంటి భాగాలు మరొక ఫోన్‌కు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ భాగాలను వేరు చేసి, మొబైల్ రిపేర్ షాపులకు అమ్ముతారు. కొత్త భాగాలు ఖరీదైనవి కావడంతో, రిపేర్ షాపులవారు తక్కువ ధరకు లభించే ఈ పాత భాగాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ఒక్కో ఫోన్ నుంచి తీసిన భాగాలు కలిపితే వ్యాపారికి మంచి లాభం వస్తుంది.