Snake strategies: బాబోయ్.. పాములకు కూడా ఇన్ని తెలివితేటలు ఉంటాయా?

Published : Jul 11, 2026, 03:10 PM IST

Snake strategies: పాములు అంటే చాలామందికి భయం. అయితే అన్ని పాములు వెంటనే దాడి చేయవు. కొన్ని జాతుల పాములు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చావు తెలివితేటలు ప్రదర్శిస్తాయి. ఇంతకీ ఆ చావు తెలివితేటలేంటో తెలుసా? 

PREV
14
పాముకు కూడా చావు తెలివితేటలు ఉంటాయి

పాములు వాటంతట అవి మనుషులపై దాడి చేయవని అందరికీ తెలిసిందే. వాటికి ప్రమాదం అని తెలిస్తే...ప్రాణాలు కాపాడుకోవడానికి దాడి చేస్తాయే తప్ప డైరెక్ట్ గా ప్రాణం మీదికి రావు. కానీ కొన్ని రకాల పాములు మాత్రం చావు తెలివితేటలు ప్రదర్శిస్తాయి. వాటిలో ఒకటి "డెత్ ఫెయినింగ్" (Death Feigning) లేదా "థానటోసిస్" (Thanatosis) అనే సర్వైవల్ టెక్నిక్.

24
ఆత్మరక్షణ

ఈ పద్ధతిలో పాము తన శరీరాన్ని పూర్తిగా సడలించి, కదలకుండా చనిపోయినట్టుగా పడుకుంటుంది. కొన్నిసార్లు నోరు తెరిచి, నాలుక బయటకు కనిపించేలా కూడా ఉంటుంది. దీన్ని చూసిన ఎదుటివ్యక్తి అది ఇప్పటికే చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. శత్రువు పూర్తిగా వెళ్లిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ పాము నెమ్మదిగా కదిలి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇది ప్రకృతి జీవులకు నేర్పిన అద్భుతమైన ఆత్మరక్షణ పద్ధతుల్లో ఒకటి.

34
హాగ్‌నోస్ స్నేక్ (Hognose Snake) జాతుల్లో ఈ ప్రవర్తన

ముఖ్యంగా హాగ్‌నోస్ స్నేక్ (Hognose Snake) వంటి కొన్ని జాతుల్లో ఈ ప్రవర్తన కనిపిస్తుంది. అయితే అన్ని పాములు ఇలా చేయవు. చాలా జాతులు ప్రమాదం ఎదురైతే పారిపోవడం లేదా తమను తాము రక్షించుకోవడానికి బుసలు కొట్టడం, అవసరమైతే మాత్రమే కాటు వేస్తాయి. జంతు శాస్త్రవేత్తల ప్రకారం, చనిపోయినట్టు నటించడం వల్ల కొన్ని వేటగాళ్లు వాటి జోలికి వెళ్లరు. దీంతో పాముకు ప్రాణాలతో బయటపడే అవకాశం పెరుగుతుంది. 

44
ప్రతి జీవికి ఒక ప్రత్యేకత

ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొందరికి వేగంగా పరుగెత్తే శక్తి, మరికొందరికి రంగు మార్చుకునే సామర్థ్యం, ఇంకొన్ని జీవులకు చనిపోయినట్టుగా నటించే తెలివి. ఈ విభిన్నమైన సర్వైవల్ టెక్నిక్స్ ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మరోసారి గుర్తు చేస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories