Human Fridge: మనుషుల ఫ్రిజ్ వచ్చేసింది, వేడిగా అనిపిస్తే అందులో కూర్చుంటే చాలు.. ధర ఎంతంటే?

Published : Jul 24, 2026, 10:18 AM IST

Human Fridge: వేసవి కాలంలో లేదా బాగా పనిచేశాక ఉక్కగా అనిపించినా ఇక్కడ ఇచ్చిన మనుషుల ఫ్రిజ్ లో కాసేపు కూర్చుంటే చాలా కూల్ అయిపోతారు. ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ఫ్రిజ్ ధర ఎంతో తెలుసా?

PREV
13
మనుషుల కోసం ఫ్రిజ్

కూరగాయల కోసం ఫ్రిజ్ ఎలా వాడుతున్నామో అలా మనుషుల కోసం కూడా ఫ్రిజ్ వచ్చేసింది. ప్రతిఏడాది గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచంలో వేడి పెరిగిపోతోంది. ఇక వేసవి కాలంలో ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. జపాన్‌లో వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. బయట కొద్దిసేపు నిలబడినా శరీరం వేడెక్కిపోతుంది. నిర్మాణ పనులు చేసే కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులు, రోడ్లపై పనిచేసే వారు. అందుకే వారికోసం ఓ వినూత్న పరిష్కారం చూపించింది జపాన్. అక్కడి ఒక కంపెనీ మనిషి లోపలికి వెళ్లి కూర్చునే ప్రత్యేక కూలింగ్ బాక్సును తయారు చేసింది. దీన్నే చాలామందిహ్యూమన్ ఫ్రిజ్ అని పిలుస్తున్నారు. ఇది బయటకు చూస్తే చిన్న గది లేదా పెద్ద ఫ్రిజ్‌లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి కూర్చుంటే కొన్ని నిమిషాల్లోనే శరీర వేడి తగ్గి చల్లగా అనిపించేలా దీన్ని రూపొందించారు.

23
ఎంత ఉష్ణోగ్రతలు ఉంటాయి

ఈ మనుషుల ఫ్రిజ్ ను వాడడం చాలా సులభం. తలుపు తెరిచి లోపల ఉన్న కుర్చీలో కూర్చోవాలి. తలుపు మూసిన వెంటనే చల్లటి గాలి తల, మెడ, భుజాలు, వీపు వైపు వేగంగా వస్తుంది. లోపల ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీంతో కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది. ఎండలో ఎక్కువసేపు పనిచేసి అలసిపోయిన వారికి ఇది వెంటనే ఉపశమనం ఇస్తుందని తయారీ సంస్థ చెబుతోంది. భద్రత కోసం ఇందులో ఆటోమేటిక్ టైమర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కువసేపు లోపల ఉండకుండా నిర్ణీత సమయం పూర్తయ్యాక ఇది స్వయంగా ఆఫ్ అవుతుంది. అందుకే దీనిని కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే కొత్త సాంకేతిక పరిష్కారంగా చూస్తున్నారు.

33
హ్యూమన్ ఫ్రిజ్ ధర ఎంత?

ఈ కూలింగ్ బాక్స్ ధర మాత్రం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేంత తక్కువ మాత్రం కాదు. ఒక్క యంత్రం ధర భారత కరెన్సీలో దాదాపు రూ.9 లక్షలు ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం పెద్ద కంపెనీలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలే వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధర తగ్గితే ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు వంటి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories