Mushrooms: పుట్టగొడుగులు ఒక్క రాత్రిలో ఎలా పుట్టుకొస్తాయో తెలుసా? ఎందుకు వాటికంత డిమాండ్..?

Published : Nov 10, 2026, 08:39 AM IST

Mushrooms: వర్షాకాలంలో , తేమ ఎక్కువగా ఉన్న సమయాల్లో, నిన్నటి వరకు ఏమీ లేని చోట.. మరుసటి రోజు ఉదయానికి పుట్టగొడుగులు గుంపులు గుంపులుగా దర్శనమిస్తుంటాయి. అసలు పుట్టగొడుకులు ఎలా పుడతాయి? ఒక్క రాత్రిలో ఎలా వస్తాయి?

PREV
13
పుట్టగొడుగు మొక్క కాదు

వర్షం పడితే చాలు చెట్టు,పుట్టల్లో పుట్టగొడుకులు రాత్రికి రాత్రే పుట్టుకొస్తుంటాయి. పుట్టగొడుగులు చూస్తే.. ఎవరికైనా ఇవి ఒక్క రాత్రిలోనే నేల నుండి అకస్మాత్తుగా పుట్టుకొచ్చాయనే భావన కలుగుతుంది. కానీ, నిజానికి దీని వెనుక మట్టిలో ఎంతో కాలంగా నడుస్తున్న ఒక రహస్య జీవన చక్రం ఉంది. సాధారణంగా చాలామంది పుట్టగొడుగులను మొక్కలని భావిస్తారు. కానీ శాస్త్రీయంగా ఇవి మొక్కలు కావు, వేరే రాజ్యానికి (Kingdom Fungi) చెందిన ప్రత్యేకమైన జీవులు. మనకు నేల పైన కనిపించే గొడుగు లాంటి భాగం వాటి పూర్తి శరీరం కాదు, అది కేవలం వాటి 'ఫలదేహం' (Fruiting body) మాత్రమే. పుట్టగొడుగు అసలు శరీరం నేల లోపల, కుళ్లిన ఆకులు, చెక్క ముక్కల మధ్య దాగి ఉంటుంది.

మైసీలియం (Mycelium) రహస్య వలయం

నేలలోపల సన్నని తెల్లటి తంతువుల రూపంలో 'మైసీలియం' అనే అద్భుతమైన జాలం విస్తరించి ఉంటుంది. ఈ తెల్లటి వలయమంతా మట్టిలోని కుళ్లిన పదార్థాలను కరిగిస్తూ, తనకు కావలసిన ఆహారాన్ని వెతుక్కుంటూ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడి నేలలో తేమ పెరుగుతుందో, గాలి చల్లగా మారుతుందో, అప్పుడు నేల లోపల ఉన్న ఈ మైసీలియం ఒక్కసారిగా స్పందిస్తుంది.

23
వేగంగా పెరగడానికి వెనుక అసలు నిజం

వాతావరణం అనుకూలించగానే నేల లోపల ఉన్న మైసీలియం నుండి చిన్న చిన్న గుండ్రని మొగ్గలు బయటికి వస్తాయి. మొదట ఇవి గుండ్రని బటన్ల లాగా కనిపిస్తాయి. ఆ తర్వాత వాటి కాండం పొడవుగా మారుతుంది, పై భాగం ఉబ్బి చివరకు గొడుగులా విచ్చుకుంటుంది. పైకి చూసేవారికి ఇవి కేవలం ఒక్క రాత్రిలోనే పెరిగినట్లు కనిపిస్తాయి. కానీ ఆ వేగం వెనుక మట్టిలో చాలా కాలంగా దాగి ఉన్న జీవ ప్రక్రియ ఉంది.

స్పోర్లు (Spores) ‌- పునరుత్పత్తి

పుట్టగొడుగు టోపీ కింది భాగాన్ని పరిశీలిస్తే సన్నని పలకల లాంటి వరుసలు కనిపిస్తాయి. వీటిని 'గిల్స్' (Gills) అంటారు. ఇక్కడే అత్యంత సూక్ష్మమైన 'స్పోర్లు' (Spores) తయారవుతాయి. ఇవి మొక్కలలోని విత్తనాల లాంటివి. గాలి వీచినప్పుడు లేదా స్వల్పంగా కదిలినప్పుడు లక్షలాది సంఖ్యలో ఈ స్పోర్లు బయటికి గాలిలో కలిసిపోతాయి. సరైన తేమ, తగిన వాతావరణం దొరికినప్పుడు ఈ స్పోర్లు మొలకెత్తి మళ్ళీ కొత్త మైసీలియంగా మారుతాయి. కొన్నిసార్లు పుట్టగొడుగులు వృత్తాకారంలో వరుసగా ఏర్పడటానికి కారణం, కింద ఉన్న మైసీలియం వృత్తాకారంలో చుట్టూ విస్తరించడమే.

33
ప్రకృతిలో పుట్టగొడుగుల పాత్ర

పర్యావరణ సమతుల్యతలో పుట్టగొడుగులు కీలక పాత్ర పోషిస్తాయి. అడవిలో కుళ్లిన ఆకులు, చెట్ల చెత్తాచెదారం, చనిపోయిన జీవ పదార్థాలను కుళ్ళింపజేసి తిరిగి మట్టిలో కలిసేలా చేసే అడవి శుభ్రత కార్మికులుగా ఇవి పనిచేస్తాయి. అయితే, అడవుల్లో లేదా మట్టిలో సహజంగా కనిపించే ప్రతి పుట్టగొడుగు తినదగినది కాదని గుర్తుంచుకోవాలి. కొన్ని రకాల పుట్టగొడుగులు అత్యంత విషపూరితమైనవిగా ఉంటాయి. కాబట్టి సరైన అవగాహన లేకుండా వాటిని తాకడం లేదా తినడం ప్రమాదకరం.

ఎందుకంత డిమాండ్..

పుట్టగొడుగులకు (Mushrooms) మార్కెట్‌లో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం రుచి కోసమే కాకుండా, ఆరోగ్యం పరంగా కూడా ఎంతో ప్రయోజనకరమైనది. పుట్టగొడుగులలో విటమిన్ డి, బి-కాంప్లెక్స్, పొటాషియం, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి. కొలెస్ట్రాల్ , ఫ్యాట్ చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి , డయాబెటిస్ (చక్కెర వ్యాధి) రోగులకు ఇది ఒక వరప్రసాదం. అంతే కాదు వీటిని వండినప్పుడు వచ్చే రుచి , ఆకృతి (Texture) దాదాపు చికెన్, మటన్ లాగే అనిపిస్తుంది. అందుకే నాన్-వెజ్ ప్రియులు కూడా వీటిని ఇష్టంగా తింటారు.

Read more Photos on
click me!

Recommended Stories