Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?

Published : Nov 03, 2026, 12:15 PM IST

Most Expensive Water Bottle: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్ల బాటిల్ గా 'అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని' గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. ఒక్క వాటర్ బాటిల్ ధర రూ. 45 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు వుంటుంది. నీతా అంబానీ తాగేది నిజమేనా?

PREV
15
అక్వా డి క్రిస్టల్లో: ఒక బాటిల్ నీళ్ళ ధర 50 లక్షలా?

సాధారణంగా మనం బయటకు వెళ్తే రూ. 10 లేదా రూ. 20 పెట్టి నీళ్ల బాటిల్ కొంటాం. కొంచెం లగ్జరీ హోటల్స్ అయితే రూ. 100 వరకు ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక నీళ్ళ బాటిల్ ధర ఏకంగా 60,000 డాలర్లు ఉందంటే నమ్ముతారా? అవును, మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఈ లగ్జరీ వాటర్ బాటిల్ పేరు అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని. 2010లో జరిగిన ఒక వేలంలో ఈ లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ బాటిల్ రికార్డు స్థాయిలో 50 లక్షల రూపాయలకు అమ్ముడైంది.

25
మూడు దేశాల నీళ్లు.. అందులో బంగారం

ఈ నీళ్ల సీసాకి అంతటి రేట్ ఎందుకు ఉందనే సందేహం అందరికీ వస్తుంది. దానికి ప్రధాన కారణం అందులో ఉండే నీరు, బాటిల్ డిజైన్. ఈ సీసాలో పోసే నీళ్లు ఒకే చోటు నుంచి తీసుకోరు. ఫిజీ, ఫ్రాన్స్ దేశాల్లోని సహజ సిద్ధమైన ఊట బావులు, ఐస్‌లాండ్ కి చెందిన గ్లేసియర్ వాటర్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తారు. వీటన్నింటికీ తోడు ఈ వాటర్ లో 24 క్యారెట్ల 5 మిల్లీగ్రాముల బంగారు రేకులు మిక్స్ చేస్తారు.

35
డిజైన్ సీక్రెట్.. హెల్త్ బెనిఫిట్స్ వివరాలు

ఈ బాటిల్ ను ప్రముఖ కళాకారుడు అమేడియో మోడిగ్లియాని ఆర్ట్ స్టైల్ లో తీర్చిదిద్దారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో ఈ సీసాను డిజైన్ చేశారు. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ నీటిలో ఆల్కలైన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని కంపెనీ చెప్తోంది. దీనివల్ల చర్మం ఎంతో కాంతివంతంగా, హైడ్రేటెడ్ గా ఉంటుందని అంటారు. అయితే ఇవన్నీ ప్రధానంగా మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా చెప్పే విషయాలేనని పరిశోధకులు భావిస్తారు.

45
నీతా అంబానీ తాగుతారా? వైరల్ ఫొటోల నిజం ఇదే

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఒక వార్త విపరీతంగా హల్ చల్ చేస్తుంటుంది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ రోజూ ఈ 50 లక్షల రూపాయల వాటర్ బాటిల్ నీటినే తాగుతారని ఒక ప్రచారం నడుస్తోంది. క్రికెట్ మ్యాచ్ లు లేదా ఈవెంట్లలో ఆవిడ నార్మల్ వాటర్ బాటిల్స్ పట్టుకున్న ఫొటోలను తీసుకుని, ఈ 'అక్వా డి క్రిస్టల్లో' బాటిల్ స్థానంలో మార్ఫింగ్ చేసి నెట్ లో వైరల్ చేశారు. నిజానికి నీతా అంబానీ ఈ నీటినే తాగుతారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

55
లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ వాటర్

ధర వింటే మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉండే ఈ వాటర్ బాటిల్ సాధారణ ప్రజల కోసం చేసింది కాదు. కేవలం కలెక్టర్లు, లగ్జరీ లైఫ్ ని ఇష్టపడే ధనవంతుల కోసమే ప్రత్యేకంగా తయారుచేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ గా ఇది గిన్నిస్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకుంది. నీళ్ళ కంటే బాటిల్ కి ఉన్న బంగారం, దాన్ని తయారుచేసిన విధానమే దీనికి అంతటి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Read more Photos on
click me!

Recommended Stories