'మా సోనూ సూద్ నీవేనయ్యా...' వాళ్ళ పాలిట దేవుడైన ప్రదీప్!

First Published Jan 22, 2021, 12:29 PM IST

స్టార్ యాంకర్ ప్రదీప్ మంచి పనులు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జీ తెలుగులో పనిచేసే కొందరు వర్కర్స్ మరియు సాంకేతిక నిపుణులు ఆయన చేసిన మేలుకు సన్మానించారు. చిత్ర పరిశ్రమలో సోనూ సూద్, బుల్లితెరపై మీరు అంటూ ప్రదీప్ సేవలను కొనియాడారు. 

రెండు రోజుల  జీ తెలుగు సరిగమప వేదిక సాక్షిగా సింగర్ పవన్ కళ్యాణ్ కి ప్రదీప్ గొప్ప సాయం చేశారు.  ఆర్ధికంగా పేదవాడైన పవన్ కళ్యాణ్ కి ఇంజనీరింగ్ పూర్తి అయ్యేవరకు అయ్యే ఫీజులు తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ తో పాటు డ్రైవర్ అయిన అతని తండ్రి సంతోషం వ్యక్తం చేశారు.
undefined
కాగా లాక్ డౌన్ సమయంలో ప్రదీప్ ఎంతో మంది బుల్లితెర  వర్కర్స్ కి సహాయం చేశారట. ఈ విషయం జీ తెలుగు సరిగమప వేదిక సాక్షిగా వెలుగులోకి వచ్చింది.  జీ తెలుగు ప్రోగ్రామ్స్ కొరకు పనిచేస్తున్న కొందరు వర్కర్స్, సాంకేతిక నిపుణులు ఆయనను సన్మానించారు.
undefined
లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న తమను ప్రదీప్ ఆదుకున్నారని వారు తెలియజేశారు.  ప్రదీప్ ని సదరు బుల్లితెర వర్కర్స్ సోనూ సూద్ తో పోల్చారు
undefined
undefined
కరోనా సమయంలో వందల మందికి  సహాయం చేసిన సోనూ సూద్ మాదిరి, బుల్లితెర వర్కర్స్, సాంకేతిక నిపుణులను ప్రదీప్ ఆదుకున్నారని వారు తెలియజేశారు.  తమ సోనూ సూద్ మీరే అంటూ ప్రదీప్ గొప్ప మనసును వారు కొనియాడారు.
undefined
ప్రదీప్ ఒక చెట్టులాంటి వారని, ఇవ్వడం తప్పా తీసుకోవడం తెలియదని వారు తెలియజేశారు.  సోనూ సూద్ కి ఓ మొమెంటో బహుకరించడంతో పాటు, శాలువా కప్పి సత్కరించారు.
undefined
జీ సరిగమప వేదికపై జరిగిన ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.  కాగా ప్రదీప్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 26వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.
undefined
ఈ చిత్ర ట్రైలర్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ బాగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో  మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
undefined
click me!