రేసులో రాజమౌళి టాప్... ఆ తరువాత స్థానాల్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరంటే?

First Published Jan 22, 2021, 9:21 AM IST

గత ఐదేళ్లుగా టాలీవుడ్ దేశంలోనే భారీ చిత్రాలను తెరకెక్కించే పరిశ్రమగా ఎదిగింది. యువ దర్శకుల రాకతో అద్భుతమైన కంటెంట్ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్నాయి. ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అందరూ కోలీవుడ్ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, దేశంలోనే నంబర్ వన్ చిత్ర పరిశ్రమగా టాలీవుడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వయంగా చెప్పారు. 
టాలీవుడ్ పరిశ్రమకు ఎంత ఖ్యాతి తెచ్చిన క్రెడిట్ దర్శకులకే దక్కుతుంది. మరి ప్రస్తుత టాలీవుడ్ దర్శకులలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం... 
 

ఈ విషయంలో అగ్రతాంబూలం దర్శకుడు రాజమౌళిదే. ఓటమి ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో ఎప్పటి నుండో నంబర్ వన్ గా ఉన్న రాజమౌళి బాహుబలి సిరీస్ తో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దేశంలోనే టాప్ డైరెక్టర్ గా రాజమౌళి ఉన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ కూడా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన స్థాయిని అంచనా వేయడమే కష్టం.
undefined
టాలీవుడ్ లో అనతి కాలంలో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు కొరటాల శివ. 2013లో విడుదలైన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన ఈ రైటర్ అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి తరువాత పేరు తెచ్చుకున్నారు. కొరటాల ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలు విజయం సాధించాయి. దీనితో రాజమౌళి తరువాత ర్యాంక్ ఆయనకు ఇవ్వవచ్చు.
undefined
లెక్కల మాస్టర్ సుకుమార్ వరుస బ్లాక్ బస్టర్స్ తో టాప్ గేర్ లో ఉన్నారు. అయితే రెండేళ్లకు మూడేళ్లకు ఆయన నుండి ఒక మూవీ రావడం నిరాశపరిచే అంశం. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి కూడా ఆయనకు మరో మూవీ ఒకే చేయడానికి రెండేళ్లు పట్టింది. ఏదిఏమైనా సుకుమార్ టాప్ డైరెక్టర్స్ రేసులో ముందు వరసలో ఉన్నారు.
undefined
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీ విజయంతో మరలా రేసులో వచ్చి చేరారు. అజ్ఞాతవాసి పరాజయం ఆయన ఇమేజ్ ని భారీగా దెబ్బ తీసింది. కాపీ వివాదంలో చిక్కుకున్న త్రివిక్రమ్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి... తాను ఏమిటో నిరూపించారు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్న త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో వచ్చి చేరారు.
undefined
టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో వచ్చి చేరిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ సడన్ గా రేసులో జాయిన్ అయ్యారు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో రెండు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ అనిల్ రావిపూడి అందుకున్నారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా అనిల్ రావిపూడి ఉన్నారు.
undefined
ఆ తరువాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి మాట్లాడుకోవాలి. ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయంతో ఆయన మరలా టాప్ ఫార్మ్ లోకి వచ్చాడు. పోకిరి విజయంతో టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ గా  ఎదిగిన పూరి... వరుస పరాజయాల కారణంగా రేసులో  వెనుకబడ్డారు. విజయ్ దేవరకొండతో ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ విజయం సాధిస్తే పూరీని ఆపడం కష్టమే.
undefined
ఇక టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న మరో మాస్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డి. ఆయన గత చిత్రం సైరా తెలుగులో రికార్డు వసూళ్లు సాధించింది. అయితే పాన్ ఇండియా మూవీగా ఇతర భాషలలో విఫలం చెందడం నిరాశపరిచింది. పవన్ తో మూవీ ఓకే చేసిన సురేంధర్ రెడ్డి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో కొనసాగుతున్నారు.
undefined
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచుకున్నారు క్రిష్.  అయితే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఆయన సతమతమవుతున్నారు. శాతకర్ణి మూవీతో హిట్ అందుకున్న క్రిష్ తరువాత కెరీర్ లో వెనుకబడ్డారు. ఆయన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్స్ ఘోర పరాజయం పొందడంతో క్రిష్ ఇమేజ్ డామేజ్ అయ్యింది. పవన్ మూవీతో ఆయన తిరిగి సత్తా చాటాలని చూస్తున్నారు.
undefined
కెరీర్ బిగినింగ్ నుండి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న వంశీ పైడిపల్లి కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. మహేష్ తో మహర్షి లాంటి హిట్ కొట్టి కూడా ఆయన మరో మూవీ ఓకె చేయలేకపోయారు.  దీనితో మిగతా దర్శకులతో పోల్చితే రేసులో వెనుకబడ్డారు.
undefined
ఇక ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ గా ఉన్న వివి వినాయక్, శ్రీను వైట్ల టాప్ డైరెక్టర్స్ లిస్ట్ నుండి అవుట్ అయ్యారు. ప్రస్తుతం వీరిని పట్టించుకొనే నాథుడే లేడు.
undefined
నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, వెంకీ కుడుముల,  శివ నిర్వాణ,  గౌతమ్ తిన్ననూరి, స్వరూప్, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరడానికి అద్భుతమైన చిత్రాలతో పోటీపడుతున్నారు.
undefined
click me!