ఆలీని అవమానించిన సౌందర్య తప్పు తెలుసుకొని... ఏం చేశారో తెలుసా?

First Published Jan 22, 2021, 10:37 AM IST

నటుడుగా ఆలీది తెలుగు పరిశ్రమలో  ప్రత్యేక స్థానం. చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆలీ... హీరోగా, కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భిన్నమైన పాత్రలు చేశారు. హీరోగా 50కి పైగా సినిమాలలో నటించిన ఆలీ... అన్నిరకాల పాత్రలు చేసేవారు. అందుకే ఆలీ కెరీర్ దశాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే ఆలీ పక్కన నటించడానికి ఓ హీరోయిన్ నో చెప్పారట. కొన్నాళ్ల తరువాత అదే హీరోయిన్ ఆలీతో  ఓ సాంగ్ లో ఆడిపాడారట. ఆ ఆసక్తికర స్టోరీని దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి బయటపెట్టారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి, ఆలీతో ప్రత్యేక అనుబంధం కలిగివున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు తెరకెక్కాయి. 1994లో వచ్చిన సోసియో ఫాంటసీ చిత్రం యమలీల సంచలన విజయం సాధించింది.  ఆలీ హీరోగా కైకాల సత్యనారాయణ యముడిగా తెరకెక్కిన ఈ మూవీలో ఇంద్రజ హీరోయిన్ గా నటించారు.
undefined
నిజానికి యమలీల మూవీలో హీరోయిన్ గా మొదట సౌందర్యను అనుకున్నారట. మూవీకి ఆమె సైన్ కూడా చేశారట.  అయితే తర్వాత మనసు మార్చుకున్న సౌందర్య... కృష్ణారెడ్డితో ఆలీ పక్కన చేయను సార్ అన్నారట. నేను ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను, మీరే అర్థం చేసుకోవాలి అని సౌందర్య ఆయనను రిక్వెస్ట్ చేశారట.
undefined
అయితే ఆ మూవీలో మీరు హీరోగా చేస్తే నేను నటించడానికి సిద్దమే అని సౌందర్య చెప్పారట.  అయితే యమలీల ఆలీకి మాత్రమే సరిపోయే సబ్జెక్టు, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి.. నేను ఆలీని మార్చను అని కృష్ణారెడ్డి సౌందర్యతో అన్నారట. సౌందర్య ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఇంద్రజను తీసుకున్నారట ఎస్వీ కృష్ణారెడ్డి.
undefined
అదే ఏడాది ఎస్వీ కృష్ణారెడ్డి జగపతిబాబు హీరోగా శుభలగ్నం అనే ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. ఆ మూవీలో ఆలీ కమెడియన్ గా సినిమా పిచ్చోడు పాత్ర చేశారు. ఈ మూవీలో ఆలీకి దర్శకుడు ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారు. ఆ సాంగ్ లో ఆలీతో నటించే అవకాశం తనకు ఇవ్వాలని సౌందర్య స్వయంగా కృష్ణారెడ్డిని రిక్వెస్ట్ చేశారట.
undefined
చినుకు చినుకు అందెలతో... అనే సాంగ్ లో ఆలీ, సౌందర్య వర్షంలో డాన్స్ చేసి అలరించారు. ఇప్పటికీ ఆ సాంగ్ తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ గా ఉంది. 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' పేరుతో దర్శకుడు శ్రీపురం కిరణ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆలీ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ లాంఛింగ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీ కృష్ణారెడ్డి అప్పటి విషయాన్ని బయటపెట్టారు.
undefined
ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీల, ఘటోత్కచుడు భారీ విజయాలు అందుకున్నాయి. ఇక సౌందర్యకు ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ బిగినింగ్ లో వరుస ఆఫర్స్ ఇచ్చారు.
undefined
ఆయన దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, నంబర్ వన్, మాయలోడు వంటి హిట్ సినిమాలలో సౌందర్య హీరోయిన్ గా నటించగా కెరీర్ కి పునాది పడింది.
undefined
ఇక తెలుగు పరిశ్రమపై హీరోయిన్ గా సౌందర్య వేసిన ముద్ర ఎవరూ చెరపలేరు. లేడీ సూపర్ స్టార్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకున్నారు.
undefined
click me!