ఫ్రెంచ్ వైనరీలో తన అనుమతి లేకుండా ఆమె వాటా విక్రయించినందుకు మాజీ భార్య నటి ఏంజెలీనా జోలీ (Angelina Jolie)పై బ్రాడ్ పిట్ దావా వేసినట్లు సమాచారం. ఒకప్పటి భార్యాభర్తలైన బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కలిసి ఉన్నప్పుడు కొనుగోలు చేసిన షాటో మిరావల్, కోర్రెన్స్, ఫ్రాన్స్ వైనరీకి సంబంధించి ఏంజెలీనా జోలీ నిర్వహించిన వ్యాపార లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది.