హిందీ మార్కెట్ లో దేవర పరిస్థితి ఏంటి.. పుష్ప లాగా మ్యాజిక్ జరగాల్సిందే ?

First Published | Sep 26, 2024, 1:22 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. మరికొన్ని గంటల్లో దేవర మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహాయిస్తే ప్రమోషన్స్ అన్నీ బాగానే జరిగాయి. ఎన్టీఆర్ అండ్ టీమ్ వివిధ నగరాల్లో పర్యటించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. మరికొన్ని గంటల్లో దేవర మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహాయిస్తే ప్రమోషన్స్ అన్నీ బాగానే జరిగాయి. ఎన్టీఆర్ అండ్ టీమ్ వివిధ నగరాల్లో పర్యటించారు. తెలుగు తర్వాత దేవర చిత్ర యూనిట్ ఆ స్థాయిలో ఆశలు పెట్టుకుని ఉన్న మార్కెట్ హిందీ. 

హిందీలో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ అయ్యాయి. ఇది కూడా కాస్త ప్రభావం చూపింది. అయితే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. కానీ ఇది సరిపోదు. బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కింది కాబట్టి ప్రభాస్ అక్కడ జనాల్లోకి బాగా వెళ్ళాడు. దేవర చిత్ర ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపలేకపోయింది. 


పుష్ప చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఉండింది. కానీ హిందీలో మొదటి వారం తర్వాత పుష్ప పికప్ అయింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దేవర చిత్ర యూనిట్ కూడా హిందీ మార్కెట్ విషయంలో ఇలాంటి ఆశలే పెట్టుకుని ఉంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి వసూళ్లు ఉంటాయి. హిందీలో దేవర చిత్రానికి కలసి వచ్చే మరో అంశం జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్. వీళ్ళు కనుక మొదటి రోజు ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకువచ్చి.. టాక్ పాజిటివ్ గా ఉంటే.. ఆ తర్వాత భారీ వసూళ్లు ఖాయం. 

తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో దేవర చిత్రానికి తిరుగులేదు. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఓవర్సీస్ లో అయితే ఆల్రెడీ రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే వచ్చేశాయి. 

అదే విధంగా తమిళంలో దేవర వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. తమిళ హీరోలని తెలుగు ఆడియన్స్ ఆదరించినంతగా.. తెలుగు హీరోలకి అక్కడ ఆదరణ ఉండదు. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమాల వల్ల పరిస్థితులు మారుతున్నాయి. 

Latest Videos

click me!