వేణు స్వామి బండారం బయటపెట్టిన యంగ్ హీరోయిన్... ఆధారాలు చూపుతూ ఆరోపణలు!

Published : Mar 11, 2024, 07:35 PM IST

వేణు స్వామి చెప్పేవన్నీ అబద్దాలే అంటుంది యంగ్ హీరోయిన్. ఈ మేరకు ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
15
వేణు స్వామి బండారం బయటపెట్టిన యంగ్ హీరోయిన్... ఆధారాలు చూపుతూ ఆరోపణలు!
Venu Swami

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినీ నటులు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు. స్టార్ హీరోల పర్సనల్ లైఫ్ గురించి వివాదాస్పద కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ కి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇండస్ట్రీలో వేణు స్వామికి మంచి డిమాండ్ ఉంది. కొందరు సెలబ్స్  కెరీర్  లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆయనతో ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. వేణు స్వామి చెప్పేవన్నీ నిజాలు అని నమ్మేవాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. 
 

25
photo credit mana star

అందుకే అతనికి లక్షలు చెల్లించి మరి పూజలు జరిపించుకుంటారు.  గతంలో రష్మిక మందన్న, డింపుల్ హయాతి, అషు రెడ్డి, ఇనాయ సుల్తానా వంటి వారు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. రీసెంట్ గా డింపుల్ హయతి తో వైన్ బాటిల్స్ పూజలో పెట్టించారు. తన పూజల్లో మాంసం, మద్యం ఉపయోగిస్తానని వేణు స్వామి గతంలోనే చెప్పడం విశేషం. 

 

35
Venu Swami

కాగా వేణు స్వామికి పరిశ్రమలో చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. వేణు స్వామి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల ఓపెనింగ్ సెరిమనీ పూజల్లో పాల్గొన్నాడు. టీనేజ్ నుండే వేణు స్వామికి ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. 

45


మరొక ట్విస్ట్ ఏంటంటే... ఆయన కొన్ని సినిమాల్లో నటించాడు కూడాను. ఏదైనా సీన్ లో పూజారి వేషం అవసరం అయినప్పుడు వేణు స్వామి నటించేవాడు. అనంతరం వేణు స్వామి కొన్ని ప్రత్యేక పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆయనతో పూజలు చేయించుకుంటే లైఫ్ మారిపోతుందని నమ్మేవారు ఉన్నారు. 


 

55
Kushita kallapu

అయితే యూట్యూబర్ హీరోయిన్ కుషిత కల్లపు కు మాత్రం నమ్మకం లేదట. అందుకు ఆమె ఓ సంఘటన తెరపైకి తెచ్చింది. గతంలో నేను వేణు స్వామిని కలిశాను. నీ జాతకం మారిపోతుంది. అంతా మంచే జరుగుతుంది అన్నారు. కానీ తర్వాత ఓ ఇష్యు అయ్యింది. కాబట్టి వేణు స్వామి చెప్పేవన్నీ  అబద్దాలే అని కుషిత అన్నారు. వేణు స్వామి చెప్పినట్లు తన జీవితం ఏమీ మారలేదు. పైగా సమస్యలు వచ్చాయని ఆమె చెప్పకనే చెప్పింది. 

click me!

Recommended Stories