గుర్తుపట్టలేనంతగా మారిపోయిన `జబర్దస్త్` వినోదిని.. ఆ సమస్యతోనే ఈ పరిస్థితి.. పైగా అమ్మాయి మోసం..

Published : Mar 11, 2024, 06:52 PM ISTUpdated : Mar 11, 2024, 06:53 PM IST

జబర్దస్త్ కామెడీ షోలో వినోదిని తనదైన కామెడీతో అలరించింది. నవ్వులు పూయించింది. కానీ అనారోగ్యంతో ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.   

PREV
17
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన `జబర్దస్త్` వినోదిని.. ఆ సమస్యతోనే ఈ పరిస్థితి.. పైగా అమ్మాయి మోసం..

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలుగా మారి ఎంతగానో నవ్వులు పూయిస్తున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని అమ్మాయిగా ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. అమ్మాయిలా కామెడీ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలా అమ్మాయి గెటప్‌లో నవ్వులు పూయిస్తున్న కమెడియన్‌ `జబర్దస్త్` వినోదిని. అసలు పేరు వినోద్‌. జబర్దస్త్ ఆఫర్ల కోసం అమ్మాయి గెటప్‌లో కామెడీ చేస్తూ రాణిస్తున్నారు. 
 

27

గయ్యాలితనంతో కూడిన స్కిట్లు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నాడు వినోద్‌. తాను అబ్బాయి అనే ఆలోచన ఏమాత్రం రాకుండా అంతటి పర్‌ఫెక్ట్ కమెడీ టైమింగ్‌తో, పంచ్‌లతో అలరిస్తున్నారు. కొన్నేళ్లుగా నవ్వులు పూయిస్తున్నారు. చమ్మక్‌ చంద్ర వంటి వారితో కలిసి ఎన్నో స్కిట్లు చేశారు. 
 

37

అయితే ఉన్నట్టుండి ఇటీవల జబర్దస్త్ కి దూరమయ్యాడు వినోద్‌. చాలా రోజులుగా ఆయన కనిపించడం లేదు. అనారోగ్యంతో తాను దూరమైనట్టు ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇప్పుడు మరింత గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అసలు వినోదేనా ఇది అనే ఆశ్చర్యపోయేలా చాలా సన్నగా మారిపోయాడు. ఆయన ఊపిరితిత్తుల వ్యాధి(లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే దీనికి ట్రీట్‌మెంట్‌ స్టార్ట్ చేశాడు. 
 

47

అయితే ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోవడంతో ఈ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందట. అది ఆలస్యంగా గుర్తించినట్టు తెలిపారు. ఈ కారణంగా తాను బరువు తగ్గిపోయాడట. క్రమంగా వెయిట్‌ లాస్‌ అయ్యాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే నెలలోనే చాలా వెయిట్‌ తగ్గిపోవడంతో టెస్ట్ లు చేసుకుంటే ఈ వ్యాధి ఉందని నిర్థారణ అయ్యింది. లంగ్స్ నుంచి నీరు తీసేసి ట్రీట్‌ మెంట్‌ తీసుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ఫుడ్‌ సరిగా తీసుకోకపోవడం, బయట జంక్‌ ఫుడ్‌ తినడం కూడా దీనికి కారణమయ్యిందన్నారు. 
 

57

ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడినట్టు తెలిపాడు. కానీ ట్రీట్‌మెంట్‌ మాత్రం జరుగుతూనే ఉన్నట్టు చెప్పాడు. వెయిట్‌ లాస్‌ మళ్లీ గెయిన్‌ అవుతున్నానని, మంచి ఫుడ్‌ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమస్య కారణంగా మానసికంగా తాను బాగా కుంగిపోయానని, అది కూడా వెయిట్‌ లాస్‌కి కారణమయ్యిందన్నారు. ఆ సమయంలో తన ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ గా నిలిచిందన్నారు. జబర్దస్త్ కమెడియన్లు కూడా ఎంతో సపోర్ట్ చేశారని, మంచి డాక్టర్‌ని కలవడంతో వారి సహకారం ఎంతో ఉందన్నారు. ఫైనాన్షియల్‌గా కూడా కొంత సహకారం అందించారని చెప్పారు. 
 

67

అలాగే జబర్దస్త్ మాజీ జడ్జ్ మంత్రి రోజా కూడా తనకు అండగా నిలిచిందని, ఎప్పటికప్పుడు ఆమె తన ఆరోగ్యంపై ఆరాతీసిందని, తనకు మోరల్‌ సపోర్ట్ ఇస్తుందన్నారు. అందరి సపోర్ట్ తోనే తాను చావు అంచుల నుంచి తిరిగి కోలుకున్నట్టు తెలిపారు. ఇప్పుడిప్పుడు మళ్లీ షోస్‌ వస్తున్నాయని, వర్క్ లోకి వెళ్తూ బిజీ అవుతున్నట్టు తెలిపారు. మున్ముందు మరింత బిజీ కావాలని కోరుకుంటున్నట్టు తలెఇపారు. 
 

77

ఓ వైపు ఈ సమస్య ఉంటే, మరోవైపు ఓ అమ్మాయి తనని మోసం చేసిందన్నారు. తాను ఓ అమ్మాయిని చెల్లిగా భావించానని, అంతగా క్లోజ్‌ అయ్యిందని, ఈ క్లోజ్‌నెస్‌తో తన వద్ద ఐదు లక్షలు డబ్బు తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిందని వాపోయాడు. ఒక వైపు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఆ అమ్మాయి ఇలా తనని మోసం చేసిందని, ఆ తర్వాత తనకు కనిపించను కూడా లేదన్నారు. ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్‌ అలియాస్‌ వినోదిని ఈ విషయాలను పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం సెట్‌ అయినట్టే అని వెల్లడించాడు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories