హీరో శర్వానంద్ పేరు మార్చిన ఫ్యాన్స్.. యంగ్ హీరోకు కొత్త పేరు నచ్చినట్టేనా..?

Published : Jun 06, 2024, 05:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పేరు మారిపోయింది. అవును ఆయనకు ఫ్యాన్స్ న్యూనేమ్ టాగ్ ఇచ్చారు. ఈపేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుమోగిపోతోంది. ఇంతకీ శర్వానంద్ పేరు ఏంటోతెలుసా..?

PREV
15
హీరో శర్వానంద్ పేరు మార్చిన ఫ్యాన్స్.. యంగ్ హీరోకు కొత్త పేరు నచ్చినట్టేనా..?

ఈమధ్య ఎక్కువగా కనిపించలేదు యంగ్ హీరో శర్వానంద్. పెళ్లి, పాప పుట్టిన తరువాత శర్వకాస్త ఫ్యామిలీ తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాడు. సినిమా షూటింగ్ కు వెళ్తున్నా.. ఆతరువాత టైమ్ అంతా ప్యామిలీకి ఇచ్చేశాడు. ఈక్రమంలో శర్వానంద్ చేసిన మరో పని ఏంటంటే..బరువుతగ్గడం. ఏం చేశాడో.. ఎలా చేశాడో తెలియదు కాని.. బొద్దుగా..ముద్దుగా.. క్యూట్ గా ఉండే శర్వానంద్.. సడెన్ గా బక్కగా అయిపోయి కనిపించాడు. 

25

శర్వానంద్ అస్సలు గుర్తు పట్టకుండా అయిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలందరికి ఏదో ఒక ట్యాగ్ ఉంది. మెగాస్టార్, సూపర్ స్టార్.. ఐకాన్ స్టార్, గ్లోబల్ స్టార్, ఇలా రకరకాల ట్యాగ్ లు ఉన్నాయి. అయితే ఇందులోఏ ట్యాగు లేకుండా మంచి పేరు తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. అందులో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు ముందు ఓ ట్యాగ్ ను తలిగించారు ఫ్యాన్స్. 

35

ఇంతకీ విషయం ఏంటీ అంటే..? తాజాగా హీరో శర్వానంద్ నటించిన సినిమా మనమే . కృతిశెట్టి  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జూన్ 7వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు . ఈ ఈవెంట్లో చిత్ర బృందం చాలా జోష్ ఫుల్ గా పాల్గొనింది. ఈవెంట్లో మనమే సినిమా నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు .  ఆ ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
 

45

శర్వానంద్ కి చార్మింగ్ స్టార్ అంటూ ఒక సరి కొత్త ట్యాగ్ ఇచ్చారు . చార్మింగ్ స్టార్ అనే టైటిల్ లోగో అక్కడ స్క్రీన్ పై ప్లే చేసి మరి చూపించారు . దీంతో శర్వానంద ఫ్యాన్స్ అరుపులు కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయింది . అయితే ఈ సందర్భంగా శర్వానంద్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే... గతంలో మహానుభావుడు సినిమా టైంలో డైరెక్టర్ మారుతి ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోమని చాలా పేర్లు వినిపించాడు. కాని నేను పట్టించుకోలేదు అన్నారు శర్వ. 

55

అప్పుడు నాకు  పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటూ వదిలేశానని .. ఇప్పుడు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అని ..థాంక్యూ సార్ అంటూ శర్వానంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ ట్యాగ్ విషయంలో దిల్ ఖష్ అయిన ఫ్యాన్స్.. ఈ ట్యాగ్ ను.. హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories