Ketika Sharam: చేతిలో చీజ్ కేక్ కళ్ళలో హాట్ స్పార్క్... సాలిడ్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న కేతిక శర్మ!

Published : May 19, 2022, 06:22 PM IST

హాట్ సమ్మర్ లో మ్యాంగో చీజ్ కేక్ తింటూ బోల్డ్ ఫోజులిచ్చింది కేతిక శర్మ. చీటింగ్ డే అంటూ తినకూడని పదార్థం తప్పక తినేస్తుంది. ఇక చేతిలో కేకు ఉండగా కళ్ళల్లో మాత్రం సెక్సీనెస్ ఉట్టిపడుతుంది. కేతిక టెంప్టింగ్ ఫోజులు పరేషాన్ చేస్తున్నాయి. 

PREV
18
Ketika Sharam: చేతిలో చీజ్ కేక్ కళ్ళలో హాట్ స్పార్క్... సాలిడ్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న కేతిక శర్మ!
Ketika Sharma

  మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన కేతిక.. దర్శకుడు పూరి కంట్లో పడింది. 'రొమాంటిక్' కథకు ఫ్రెష్ పేస్ తో పాటు హాట్ బ్యూటీ కావాలని తలచి, కేతికను ఎంపిక చేశారు.  ట్రాజిక్ ఎండింగ్ కలిగిన ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో రెచ్చిపోయి నటించింది కేతిక శర్మ. రొమాంటిక్ ఆమె డెబ్యూ చిత్రం కాగా, అరంగేట్రంతోనే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. హీరో ఆకాష్ పూరి (Akash puri)తో కలిసి ఆమె బోల్డ్ సన్నివేశాల్లో తెగించి నటించింది. 
 

28
Ketika Sharma


శృంగారమే పరమావధి అని ఆలోచిందే అబ్బాయి, అమ్మాయి మధ్య రిలేషన్ ఏర్పడితే, వాళ్ళ మధ్య ఇంటిమసి, ఏ స్థాయిలో హద్దులు దాటేస్తుందో రొమాంటిక్ మూవీలో చెప్పారు. అలాగే ప్రేమను మొహం గా భావిస్తున్న ఓ యువ జంట ఆలోచనలు బోల్డ్ గా చెప్పారు. 
 

38
Ketika Sharma

ఈ కాన్సెప్ట్ లో హీరో హీరోయిన్స్ లీనమై నటించారు. ఇక కేతిక (Ketika sharma) గ్లామర్ కి తెలుగు కుర్రాళ్ళు పడిపోయారు. యంగ్ బ్యూటీ పచ్చిపాల పరువాలకు ముగ్దులైపోయారు. సినిమాలో లెక్కకు మించి ఉన్న హై వోల్టేజ్ రొమాంటిక్ సీన్స్, యువతను కుర్చీలలో కుదురుగా కూర్చో నివ్వలేదు. 
 

48


దీనితో మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టింది, కేతిక శర్మ. దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రానికి దర్శకుడు పూరి.. కథ స్క్రీన్ ప్లే సమకూర్చారు. తన సొంత నిర్మాణ సంస్థలో ఛార్మితో పాటు నిర్మించారు. ఫలితం మాత్రం అనుకున్న స్థాయిలో దక్కలేదు. 

58

రొమాంటిక్ చిత్రీకరణలో ఉండగానే, నాగ శౌర్య హీరోగా విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ... లక్ష్య చిత్రంలో ఆఫర్ దక్కించుకున్నారు. నాగ శౌర్య ఈ మూవీలో ప్రొఫెషనల్ ఆర్చర్ రోల్ చేశారు. అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ నిరాశారిచింది. 

68

వరుసగా రెండు పరాజయాలు ఎదురు కాగా మూడో ఛాన్స్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ పక్కన దక్కించుకుంది. ఆయన హీరోగా  తెరకెక్కుతున్న రంగ రంగ వైభవంగా చిత్రంలో కేతిక హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫలితం పైనే కేతిక కెరీర్ ఆధారపడి ఉంది. 
 

78

ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ కి కొండపొలం మూవీ షాక్ ఇచ్చింది. టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ ప్రయోగాత్మక చిత్రం దారుణమైన పరాజయం పొందింది. ఈ క్రమంలో రంగ రంగ వైభవంగా మూవీతో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటరైనర్ కేతిక, వైష్ణవ్ లకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 

88

మరోవైపు సోషల్ మీడియాలో కేతిక రచ్చ మాములుగా లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ, కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. సహజంగా సంక్రమించిన పరువాల సంపద ప్రదర్శిస్తూ గిలిగింతలు పెడుతుంది. కేతికను ఇంస్టాగ్రామ్ లో దాదాపు రెండు మిలియన్స్ వరకు ఫాలో అవుతున్నారు.  పూరి వెండితెరకు పరిచయం చేసిన అనుష్క శెట్టి, అసిన్, దిశా పటాని వెండితెరను ఏలుతున్నారు. మరి కేతిక కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిద్దాం... 

click me!

Recommended Stories