మహేష్ బాబు వద్దని వదిలేసిన కథతోనే విజయ్ సినిమా చేస్తున్నాడా..?

Published : May 19, 2022, 04:53 PM ISTUpdated : May 19, 2022, 04:56 PM IST

ఒక హీరో దగ్గర కథ రిజెక్ట్ అయితే.. అది ఎవరైనాచిన్న హీరో దగ్గరకు వెళ్లే అవకాశం ఎక్కవగా ఉంటుంది.కాని మన టాలీవుడ్  సూపర్ స్టార్ వద్దని వదిలేసిన కథతో... తమిళ్ స్టార్ హీరో భారీ స్థాయిలో సినిమా చేస్తున్నాడట. ఇది ఎంత వరకూ నిజం...?

PREV
17
మహేష్ బాబు వద్దని వదిలేసిన కథతోనే విజయ్ సినిమా చేస్తున్నాడా..?

కోలీవుడ్ లో హీర్ విజయ్  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన ప్రతీ సినిమాను భారీ స్థాయిలో హిట్ చేస్తారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన బీస్ట్ మూవీ మాత్రం  ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

27

ప్లాప్ అయినా.. హిట్ అయినా.. విజయ్ కోసం స్టార్ డైరెక్టర్లు కూడా నాలుగైదు కథలతో క్యూలో నిల్చుంటారు. ఆయనకు ఏ కథ నచ్చకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అటువంటిది విజయ్ టాలీవుడ్ సూపర్ స్టార్ వదిలేసిన కథతో సినిమా చేస్తున్నాడని టాక్. ఇంతకీ విజయ్ చేస్తున్న సినిమా ఏంటీ..?

37

విజయ్ ప్రస్తుతం  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  వంశీ  పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. తెలుగు తమిళంతో పాటు పాన్ ఇండియా రేంజ్ రూపొందుతోన్న ఈమూవీని స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 
 

47

ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే టాలీవుడ్ టాక్ ప్రకారం ఈసినిమా కథ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దని వదులుకున్నదని సమాచారం.మహర్షి తరువాత వంశీ పైడిపల్లితో మరో సినిమాచేస్తాన్నాడు మహేష్ బాబు. అయితే  మహేష్ కోసం నాలుగైదు కథలు కూడా రెడీ చేసి చెప్పాడట వంశీ. 

57

అయితే వంశీ చెప్పిన కథలు సూపర్ స్టార్ రిజక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో ఇప్పుడు విజయ్ తో చేస్తున్న సినిమా కూడా ఒకటట. అయితే ఇందులో హీరో డ్యూయల్ రోల్ కావడంతో మహేష్  చేయదలచుకోలేదని ఒక సందర్భంలో మహేశ్ చెప్పాడు. అందువలన ఈ కథను ఆయన సున్నితంగా తిరస్కరించాడు. దాంతో ఆ కథను విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. 

67

అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మాటర్ ఏంటీ అంటే.. డ్యూయర్ రోల్ మీది ఇష్టంతో పాటు..కథ కూడా నచ్చడంతో విజయ్  ఈ సినిమా చేయడానికి వెంటనే అంగీకరించాడట. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. 

77

సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈసినిమా లో హీరోయిన్ గా  రష్మికను తీసుకున్నారు. మరో కథానాయికకి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. రీసెంట్ గా ఈమూవీషూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్.. తెలంగాణ సీఏం కెసీఆర్ ను కలిశారు. 

click me!

Recommended Stories