Published : Sep 04, 2022, 07:28 PM ISTUpdated : Sep 04, 2022, 07:30 PM IST
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తుంది. మితి మీరిన గ్లామర్ షోతో టెంపరేచర్ పెంచేస్తుంది. జాన్వీ లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
షార్ట్ డెనిమ్, టాప్ ధరించిన జాన్వీ టెంప్ట్ చేసింది. చాలీ చాలని బట్టల్లో ఆమె ఫోజులు మరింత డామేజ్ చేస్తున్నాయి. అందాల దాడితో కుర్రాళ్ల నిద్ర దూరం చేస్తున్న జాన్వీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
28
కాగా జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఈ కామెడీ క్రైమ్ డ్రామాపై పెద్దగా బజ్ లేదు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి మరలా నిరాశే ఎదురైంది.
38
మరోవైపు శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు.
48
ఆమెకు సౌత్ చిత్రాల పట్ల ఆసక్తి లేదన్న ఓ వాదన పరిశ్రమలో ఉంది. బాలీవుడ్ ని సైతం దాటిపోయిన టాలీవుడ్ లో చిత్రాలు చేయడానికి ఆమెకు సంకోచం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ఈ ఆరోపణలను జాన్వీ ఖండించడం విశేషం. ఆమె సౌత్ చిత్రాల్లో నటించడానికి సిద్ధమని తెలియజేశారు.
58
కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం.
68
పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు. 2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.
78
దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమె నటిగా మార్కులు పడ్డప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.
88
ప్రస్తుతం జాన్వీ హీరోయిన్ గా మూడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మిల్లి చిత్రీకరణ పూర్తి కాగా... మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి.