అవును నా ఆస్తి విలువ వెయ్యి కోట్లు... పవిత్ర డబ్బు కోసం నాతో జీవించడం లేదు!

Published : May 22, 2023, 02:27 PM IST

నటుడు నరేష్ నా ఆస్తి విలువ వెయ్యి కోట్లు అంటూ ఓపెన్ గా చెప్పారు. అయితే నా దగ్గరున్న డబ్బు కోసం పవిత్ర రాలేదంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

PREV
15
అవును నా ఆస్తి విలువ వెయ్యి కోట్లు... పవిత్ర డబ్బు కోసం నాతో జీవించడం లేదు!


నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మళ్ళీ పెళ్లి. మే 26న తెలుగు కన్నడ భాషల్లో విడుదల కానుంది. మళ్ళీ పెళ్లి చిత్ర ప్రమోషన్స్ లో నరేష్-పవిత్ర లోకేష్ విరివిగా పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా పవిత్రతో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి.

25


నరేష్ కి కోట్ల రూపాయల ఆస్థి ఉంది. అందుకే పవిత్ర లోకేష్ ఆయనకు దగ్గరయ్యారనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో నరేశ్ స్పందించారు. అవును నేను బిలియనీర్. నా ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పై మాటే. వారసత్వంగా కొంత ఆస్తి వచ్చింది. నేను కొంత సంపాదించుకున్నాను. భూముల ధర పెరగడం వలన ఆస్తి వెయ్యికోట్లకు చేరింది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ లెక్కలు నేనెప్పుడూ చూసుకోలేదు. 
 

35


నా దగ్గర ఉన్నదంతా వైట్ మనీనే. బ్లాక్ మనీ లేదు. ఒక క్రమబద్ధంగా నా రాజ్యాన్ని నేను నిర్మించుకున్నాను. నా సిద్దాంతం ఒక్కటే. మనకు ఉన్నదాంట్లో కొంత నలుగురికి పంచాలి. చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలి. ఇక కేవలం నా దగ్గర డబ్బులు ఉన్నాయనే పవిత్ర లోకేష్ దగ్గరయ్యారు అనడంలో నిజం లేదు. మాది పవిత్ర బంధం. 

45

నా దగ్గర డబ్బు లేదని వెళ్ళిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే దగ్గరైన వాళ్ళు కూడా ఉన్నారు. పవిత్ర అలాంటి మహిళ కాదని నరేష్ చెప్పుకొచ్చాడు. నరేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ తో తన బంధాన్ని మహేష్, కృష్ణ, విజయనిర్మల అంగీకరించారని నరేష్ చెప్పడం విశేషం.

55

మా మనసులు కలిశాయి. అందుకే కలిసి జీవిస్తున్నాము. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పవిత్రను నేను పెళ్లి చేసుకోలేదు. కానీ త్వరలో వివాహం చేసుకుంటాను, అన్నారు. చాలా మందికి ఇష్టం లేకపోయినా పెళ్లి బంధంలో ఉంటున్నారు. వాళ్ళ కోసమే మళ్ళీ పెళ్లి చిత్రమని నరేష్ అన్నారు.  

click me!

Recommended Stories