అప్పుడు మేం మూసుకున్నాం.. ఇప్పుడు మీరు మూసుకోండి.. ఎన్టీఆర్‌, పవన్‌ ఫ్యాన్స్ మధ్య వార్‌..

Published : May 22, 2023, 01:55 PM ISTUpdated : May 22, 2023, 08:31 PM IST

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇద్దరి సూపర్‌ స్టార్స్ మధ్య వార్‌ జరుగుతుంది. అందులో ఒకరు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మరొకరు యంగ్‌ టైగర్‌(గ్లోబల్‌ స్టార్‌) ఎన్టీఆర్‌. ఈఇద్దరు ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో రెండు సినిమాల కోసం కొట్టుకుంటున్నారు.  

PREV
16
అప్పుడు మేం మూసుకున్నాం.. ఇప్పుడు మీరు మూసుకోండి.. ఎన్టీఆర్‌, పవన్‌ ఫ్యాన్స్ మధ్య వార్‌..

టాలీవుడ్‌లో సినిమాల రీ రిలీజ్‌లు ట్రెండ్‌ అయ్యాయి. మహేష్‌బాబు `పోకిరి` సినిమా నుంచి ఈట్రెండ్‌ స్టార్ట్ అయ్యింది. వరుసగా ఇతర హీరోల సినిమాలను కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్‌లు కూడా స్ట్రెయిట్‌ కొత్త సినిమాలను తలపించేలా జరుగుతున్నాయి. ఫస్ట్ టైమ్‌ రీ రిలీజ్‌ సినిమాకి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేశారు. ఇటీవల `సింహాద్రి`కి మూవీకి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఓవర్సీస్‌లోనూ విడుదల చేయడం, ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేయడం, అడ్వాన్స్ బుకింగ్‌, భారీ ఓపెనింగ్స్ అనే ట్రెండ్ లు కూడా వచ్చాయి. కొత్త సినిమా రిలీజ్‌కి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. అభిమానులు దీన్ని చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది. అదే సమయంలో వివాదాలకు కారణమవుతుంది.
 

26

రీ రిలీజ్‌ ట్రెండ్‌ కాస్త స్టార్‌ హీరో ఫ్యాన్స్ మధ్య వార్‌కి కారణమవుతుంది. మా హీరో సినిమా బాగా ఆడిందంటే, మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందని, మా హీరో సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ అయ్యిందని అంటున్నారు. ఇలా సోషల్‌ మీడియా వేదికగా వార్‌కి దిగుతున్నారు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా ఆయన బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటైన `సింహాద్రి`ని రీ రిలీజ్‌ చేశారు. భారీ స్థాయిలో రిలీజ్‌ చేయడంతోపాటు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. విశ్వక్‌ సేన్‌ గెస్ట్ గానూ వచ్చారు. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఏజిల్లాల్లోని అభిమానులకే ఇవ్వాలని నిర్ణయించారు. ఆపదలో ఉన్న అభిమానులను ఆదుకోవాలని నిర్ణయించారు. 
 

36

అయితే శనివారం విడులైన ఈ సినిమాకి ఓపెనింగ్‌(తొలి రోజు) 5.2కోట్ల(గ్రాస్‌) వచ్చిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఇది పవన్‌ కళ్యాణ్‌ `ఖుషి` సినిమా రీ రిలీజ్‌ కలెక్షన్లని మించిందని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అంటున్నారు. `ఖుషి`కి రూ.4.2కోట్ల గ్రాస్‌ వచ్చిందనేది వారి లెక్క. అయితే `సింహాద్రి`కి అంత సీన్‌ లేదని, నాలుగు కోట్ల లోపే వచ్చిందని, నాలుగు కోట్లని ఓ లెక్క, రూ.3.5కోట్లే అని మరో లెక్క చెబుతున్నారు పవన్‌ ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఎప్పటికీ `ఖుషి`దే ఆల్‌ టైమ్‌ రికార్డు, దాన్నిదాటే వారే లేరంటున్నారు. నిన్నటి నుంచి దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. 
 

46

మరోవైపు `ఖుషి`, `జల్సా`(3.2కోట్లు) సినిమాల టైమ్‌లో మీకు ఇష్టం వచ్చిన కలెక్షన్లు వేసుకున్నారు. మేం ప్రశ్నించలేదు. సైలెంట్‌గా ఉన్నారు. ఎలాంటి గొడవ చేయలేదు. కానీ ఇప్పుడెందుకు మీరు రచ్చ చేస్తున్నారు తారక్‌ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓర్వలేక `సింహాద్రి`కి తక్కువ కలెక్షన్లు చూపిస్తున్నారని, దాన్ని వైరల్‌ చేస్తున్నారని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్‌ జరుగుతుంది. నైజాం విషయంలోనూ అదే జరుగుతుంది. నైజాంలో `ఖుషి` రూ.1.6కోట్ల గ్రాస్‌ వస్తే, `సింహాద్రి` ఆరవై లక్షలలోపే అంటున్నారు. ఇప్పుడు రెండో రోజు విషయలోనే అదే కంటిన్యూ అవుతుంది. `ఖుషి`ని దాటలేదని చెబుతున్నారు. 

56

ఇదిలా ఉంటే వాస్తవ లెక్కల ప్రకారం, పలువురు సినిమా క్రిటిక్స్ పెట్టిన దాని ప్రకారం `సింహాద్రి` ఐదు కోట్లు దాటిందని అంటున్నారు. అధికారికంగానే చెబున్నారు. అయితే నట్టి కుమార్‌ లాంటి నిర్మాతలు మాత్రం వాస్తవ కలెక్షన్లలో పవన్‌ కళ్యాణ్ సినిమా కలెక్షన్లని ఏ సినిమా దాటలేదని, మిగిలిన వారికి ఫేక్‌ కలెక్షన్లు అని అంటున్నారు.పరోక్షంగా ఆయన ఎన్టీఆర్‌ సినిమా కలెక్షన్లు ఫేక్‌ అనే విషయాన్ని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు నిజాయితీగా `సింహాద్రి` కలెక్షన్లు ఎంతా అనేది తేలడం లేదు. ఇది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్‌కి కారణమవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ వివాదం ఫ్యాన్స్ కే పరిమితం, హీరోలు పట్టించుకోరనేది కూడా వాస్తవమే. అయితే `సింహాద్రి` కలెక్షన్లు అభిమానులకే తిరిగి ఇవ్వడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. 

66

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన `సింహాద్రి` సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించగా, భూమిక హీరోయిన్‌గా నటించింది. మరోవైపు పవన్‌ హీరోగా నటించిన `ఖుషి` సినిమాకి ఎస్‌ జే సూర్య దర్శకత్వం వహించారు. ఇందులోనూ భూమిక హీరోయిన్‌. మొత్తంగా ఈ రెండు సినిమాల్లోనూ భూమికనే హీరోయిన్‌ కావడం విశేషంగా చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories