Year Ender 2026: 2026లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన కొత్త హీరోలు వీళ్లే!

Published : Nov 28, 2026, 12:21 PM IST

Kollywood Debut Heroes in 2026: 2026లో కోలీవుడ్‌లో చాలా మంది కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టి రికార్డ్ సృష్టించారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.

PREV
15
కోలీవుడ్ కొత్త హీరోలు 2026

2026 తమిళ సినిమాకు గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. గతేడాది వరకు హిట్ సినిమాల సంఖ్య బాగా పడిపోగా.. ఈ ఏడాది అమాంతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం కొత్తవాళ్లే. ఈ ఏడాది చాలా చిన్న బడ్జెట్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఆలా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం.

25
అభిషన్ జీవింత్

శశికుమార్ హీరోగా గతేడాది వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్ జీవింత్. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో నెక్స్ట్ ఏ సినిమా డైరెక్ట్ చేస్తాడా అని అంతా ఎదురుచూశారు. కానీ, విత్ లవ్ సినిమాతో ఈ ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో అతడి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.39.44 కోట్ల వసూళ్లు సాధించింది.

35
కెన్ కరుణాస్

నటుడు కరుణాస్ కొడుకు కెన్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై పలు సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ఈ ఏడాదే. గత మార్చిలో రిలీజైన యూత్ సినిమాతో హీరోగానే కాదు.. దర్శకుడిగానూ పరిచయమయ్యాడు కెన్. సినిమా రిలీజ్‌కు ముందే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమాపై హైప్ పెరిగి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దురందర్ 2 సినిమాకు పోటీగా రిలీజైనా ఈ చిత్రం రూ.80 కోట్లకు పైగా వసూలు చేసింది.

45
లోకేష్ కనగరాజ్

ఈ ఏడాది కోలీవుడ్‌కు దొరికిన మరో మాస్ హీరో లోకేష్ కనగరాజ్. విజయ్, కమల్, రజనీకాంత్ లాంటి మాస్ హీరోలను డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్.. ఈ ఏడాది రిలీజైన డిసి సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన డిసి.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

55
రిషికాంత్

కోలీవుడ్‌కు 2026లో దొరికిన మరో హీరో రిషికాంత్. గత ఆగస్టులో రిలీజైన మొద రాత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది అతడికి రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కాయి. మొద రాత్రి తరహాలోనే.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించిన డొరొతీ సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో రిషికాంత్‌కు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories