శ్రీకాంత్ నటించిన ఓ సినిమాతో తాను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తిన్నట్లు ప్రముఖ నిర్మాత ఒకరు కామెంట్స్ చేశారు. రీ షూట్ చేసి ఉంటే ఆ సినిమా హిట్ అయి ఉండేది అని అన్నారు.
ఒకప్పుడు హీరో శ్రీకాంత్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. కుటుంబ కథా చిత్రాలతో శ్రీకాంత్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. శ్రీకాంత్ నటించిన ఓ మూవీ గురించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ తో తెరకెక్కించిన ఒక సినిమా తనని ఆర్థికంగా బాగా దెబ్బ తీసింది అని తమ్మారెడ్డి అన్నారు. ఆ సినిమా పేరు నేను పెళ్ళికి రెడీ.
25
శ్రీకాంత్ సరసన ముగ్గురు హీరోయిన్లు
ఈ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు శ్రీకాంత్ సరసన నటించారు. లయ, సంగీత, అనిత హస్సానందిని ఈ చిత్రంలో శ్రీకాంత్ కి జోడీగా నటించారు. కబడ్డీ కబడ్డీ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన వెంకీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తమ్మారెడ్డి నిర్మాత. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను పెళ్ళికి రెడీ మూవీ షూటింగ్ పూర్తయ్యాక కాపీ ఒకసారి చూశాను. అంతా ఓకె అనిపిస్తోంది.. అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయి.
35
రీ షూట్ అవసరం లేదు అన్నారు
దీనితో రీ షూట్ చేద్దాం అని దర్శకుడికి చెప్పా. రీ షూట్ అవసరం లేదు సార్.. అంతా బాగానే ఉంది అని దర్శకుడు చెప్పాడు. దీనితో నేను కూడా సైలెంట్ అయిపోయా. కానీ ఆ సినిమా ఆడియన్స్ కి ఎందుకనో నచ్చలేదు. కామెడీ సీన్లు మాత్రం చాలా బావుంటాయి. ఫ్లాప్ అవుతుందని అస్సలు ఊహించలేదు.
రీషూట్ చేసిన అనుభవం నాకు ఉంది. చిరంజీవితో రూపొందించిన కోతల రాయుడు, మొగుడు కావాలి రెండు సినిమాలు కొన్ని సీన్లు రీ షూట్ చేశాం. రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ నేను పెళ్ళికి రెడీ సినిమాకి మాత్రం రీ షూట్ చేయలేకపోయా. ఆ సినిమాకు బడ్జెట్ కోటి రూపాయలకు పైగానే ఖర్చు అయింది. మొత్తం పోయింది. అందుకే ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు అని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
55
ఎమ్మెస్ నారాయణపై కామెంట్స్
ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ ఫుల్ లెన్త్ రోల్ చేశారు. సెట్స్ లో కూడా ఆయన జోవియల్ గానే ఉంటారు. కానీ డబ్బుల విషయంలో మాత్రమే ఆయన చాలా సీరియస్ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఆయన రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశాం. టీడీఎస్ మాత్రమే కట్ చేశాం. అది అప్పట్లో జస్ట్ 2 వేలో 3 వేలో ఉండేది. అది కూడా ఇచ్చేయాలని గొడవ చేశారు అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు.