యశోద నటుడు ఉన్ని ముకుందన్ చేసిన కామెంట్స్ బట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. యశోద చిత్రం నవంబర్ 11న రిలీజ్ రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉన్ని ముకుందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్ని ముకుందన్ జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ లాంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు యశోదలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు తన రోల్ ఏంటనేది సస్పెన్స్ అని తెలిపారు.