అంతలోనే అక్కడికి వచ్చిన మాళవిక, ఖుషి ఇలా రా నీకు గోరింటాకు పెడతాను అంటుంది. వద్దు నాకు అమ్మ పెడుతుంది అంటుంది ఖుషి.అలా అనకు మాళవిక అమ్మతో గోరింటాకు పెట్టించుకో అంటుంది వేద. నువ్వు చెప్తే చేస్తాను అంటూ మాళవికతో గోరింటాకు పెట్టించుకుంటుంది వేద. నీది చాలా మంచి మనసు అక్క అని మెచ్చుకుంటుంది చిత్ర. మరోవైపు వసంత్, యష్ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు.