ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మేకర్స్ ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎలాంటి నంబర్స్ బయటపెట్టలేదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి. సాక్నిల్క్ (Sacnilk) రిపోర్ట్ ప్రకారం.. టాక్సిక్ మూవీ 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ డేటా చూస్తే, 26 ఆగస్టు 2026న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ₹333.45 కోట్లకు పైగా రాబట్టింది.
ఇతర రిపోర్ట్స్ చెబుతున్న లెక్కలు ఇలా ఉన్నాయి:
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్: ₹334.50 కోట్లు
ఇండియా టోటల్ కలెక్షన్స్: ₹290.64 కోట్లు
హిందీ బెల్ట్ వసూళ్లు: సుమారు ₹149 కోట్లు
ఓవర్సీస్ కలెక్షన్స్: ₹44.00 కోట్లు
అయితే మరో రిపోర్ట్ ప్రకారం టాక్సిక్ మూవీ ₹341.39 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇండియాలో ఈ సినిమా మొత్తం 1,54,613 షోలు పడింది. ఇంకా కొన్ని చోట్ల ప్రదర్శితమవుతూనే ఉంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇండియన్ మార్కెట్లో ఈ మూవీ ₹290 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతోంది.