ఇదిలా ఉంటే హోంబలే ఫిల్మ్స్ ఊరిస్తుంది కానీ, ఇప్పట్లో ఈ మూవీ ఉంటుందా? అనేది పెద్ద సందేహంగా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత `సలార్ 2` చేయాల్సి ఉంది.
వీటితోపాటు అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతోనూ సినిమాలున్నాయనే రూమర్స్ ఉన్నాయి.ఈ క్రమంలో `కేజీఎఫ్ 3` ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ `డ్రాగన్` తర్వాత `కేజీఎఫ్ 3` చేస్తారా? `సలార్ 2` చేస్తారా? అనేది సస్పెన్స్. ప్రశాంత్ నీల్‌పైనే ఇదంతా ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.