Ennenno Janmala Bandham: ఇంట్లో పెళ్లి విషయాన్ని బయటపెట్టిన వేద, యష్.. కోపంతో రగిలిపోతున్న సులోచన, మాలిని!

Navya G   | Asianet News
Published : Jan 27, 2022, 12:08 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Ennenno Janmala Bandham: ఇంట్లో పెళ్లి విషయాన్ని బయటపెట్టిన వేద, యష్.. కోపంతో రగిలిపోతున్న సులోచన, మాలిని!

యష్, వేద (Vedha) ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరుతారు. ఇక వేద.. యష్ (Yash) వైపు చూస్తూ అతడు అడిగిన పెళ్లి విషయాన్ని తలచుకుంటుంది. ఇక యష్ కూడా వేద వైపు చూస్తూ తన కేవలం ఖుషి కోసమే పెళ్లి చేసుకుంటున్నానన్న మాటలను తలచుకుంటాడు.
 

26

అలా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి ఇద్దరు తలచుకుంటూ ఉంటారు. ఇక యష్ (Yash) వేద (Vedha) దాహాన్ని గమనించి తనకు వాటర్ అందిస్తాడు. ఆ తర్వాత తాను తాగుతాడు. ఇక వేదకు చెమట వస్తుందని గమనించి టిష్యూ ఇస్తాడు. అలా వారిద్దరి మధ్య ఆ సన్నివేశం బాగా కూల్ గా కనిపిస్తుంది.
 

36

మరోవైపు యష్, వేద వాళ్ల నాన్న లు వీరిద్దరూ ఒకటి కానున్నారని సంబరపడిపోతూ ఇద్దరూ ఒకరినొకరు హగ్ లు ఇచ్చుకుంటారు. ఆ సమయంలో మాలిని (Maalini), సులోచనలు (Sulochana) వచ్చి వారిద్దరి క్లోజ్ ను చూసి ఇద్దరూ ఒకరికొకరు తెగ తిట్టి పోసుకుంటారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన వసంత్ వాళ్లని చూసి భయపడతాడు.
 

46

అక్కడ వాళ్ళు కలుసుకుంటే.. ఇక్కడ వీళ్ళు గొడవ పడుతున్నారు ఏంటి అని గొడవ ఆపి ఇంట్లోకి పంపిస్తాడు. ఇక వేద (Vedha), యష్ ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. మరోవైపు అభిమన్యు కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఖుషి సంతోషంగా రావడాన్ని చూసి అభిమన్యు (Abhimanyu) తట్టుకోలేక పోతాడు.
 

56

మరోవైపు మాలిని (Maalini), సులోచన (Sulochana)వాళ్లు ఇంట్లో కూడా అరుచుకుంటూ ఉంటారు. అప్పుడే వేద, యష్ వచ్చి ఆ గొడవలను ఆపి వాళ్లను కూల్ చేస్తారు. ఇక ఇద్దరూ తమ తమ ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడతారు. దాంతో తమ కుటుంబ సభ్యులు తెగ సంతోష పడతారు. ఇక వేద వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఎవరు అని అడుగుతారు.
 

66

మరోవైపు యష్ (Yash) వాళ్ళ ఇంట్లో అమ్మాయి గురించి అడుగుతారు. దాంతో పాము పెళ్లి చేసుకునే వారి పేర్లు చెప్పటంతో మాలిని, సులోచనలు (Sulochana) షాక్ అవుతారు. ఇక తరువాయి భాగంలో వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకోన్నట్లు కనిపిస్తారు.

click me!

Recommended Stories